రాష్ట్రీయం

రైతులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, నవంబర్ 20: తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే సీజను నుండి ఖరీఫ్ పంట నవంబర్ నాటికి రైతు ఇంటికి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో తుపాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటున్నందున అంతకంటే ముందుగానే పంట చేతికందేలా వ్యవసాయ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఇందుకు అనుగుణంగా ముందుగానే ఖరీఫ్ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికార్లను మంత్రి ఆదేశించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో మంత్రి శుక్రవారం పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు అందించే ఇన్‌పుట్ సబ్సిడీ, ఇతర రాయితీలు కౌలు రైతులకు కూడా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే బీమా సంస్థలు పంట నష్టం వివరాల సేకరణలో ఉన్నాయని, తుది నివేదిక వచ్చిన వెంటనే రైతులకు బీమా పరిహారం కూడా అందుతుందన్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పడిన నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చించారని, తొలి దశగా రూ.1000 కోట్లు సహాయం చేయాలని కోరారన్నారు.
ముంపు ప్రాంతాల్లోని రైతులు, వ్యవసాయ కూలీలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 150 రోజుల పని కల్పించాలని కేంద్రాన్ని కోరారన్నారు. రాష్ట్రంలో 376 కరవు పీడిత మండలాలను గుర్తించామని, ఆయా మండలాల్లో కరవు నివారణ చర్యలు చేపడుతున్నామని మంత్రి పుల్లారావు తెలిపారు. ఒకపక్క అతివృష్టి, మరోపక్క అనావృష్టి కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. మంత్రి వెంట రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ప్రభుత్వ విప్‌లు అంగర రామ్మోహానరావు, చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ కె భాస్కర్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర శాఖల అధికార్లు ఉన్నారు.