రాష్ట్రీయం

హుబ్లీ-చెన్నై-హుబ్లీ మధ్య 16 ప్రత్యేక తత్కాల్ రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రయాణీకుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే హుబ్లీ-చెన్నై-హుబ్లీ మధ్య 16 తత్కాల్ స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ నెల 7, 9, 14, 16, 21, 23, 28, 30 తేదీల్లో నెం.07324 రైలు హుబ్లీ నుంచి రాత్రి 8.20 గంటలకు బయలుదేరి తర్వాత రోజు చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంటుందని ద.మ.రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. అలాగే తిరుగు ప్రయాణంలో నెం.07323 రైలు చెన్నై సెంట్రల్ నుంచి ఈ నెల 8, 10, 15, 17, 22, 24, 29, 31 తేదీల్లో మధ్యాహ్నాం 1.45 గంటలకు బయలు దేరి తర్వాత రోజు హుబ్లీకి చేరుకుంటుందని స్పష్టం చేసింది. అలాగే చెన్నై సెంట్రల్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు మార్చి 5వ తేదీన మరో ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు మరో ప్రకటనలో తెలిపింది.