రాష్ట్రీయం

భూసేకరణపై పోరుకు జేఏసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 7: అడ్డూ అదుపులేకుండా బడా పారిశ్రామిక వేత్తలకు ఇష్టానుసారం దోచిపెట్టేందుకు జరుగుతున్న భూ సేకరణను అడ్డుకునేందుకు సంయుక్త కార్యాచరణ (జేఏసీ) నేతృత్వంలో పోరాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, పరిశ్రమలు, సెజ్‌ల పేరిట లక్షలాది ఎకరాలు సేకరిస్తూ రైతులను నిర్వాసితులుగా మారుస్తున్నారని మండిపడ్డారు. జనసేన ఆధ్వర్యాన విశాఖ నగరంలో శుక్రవారం నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్ భూ నిర్వాసితుల జసనభ’లో ఆయన నిర్వాసిత సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. భూములు కోల్పోయిన నిర్వాసితులు ఎవరికి వారుగా ఉద్యమాలు చేస్తే ఫలితం ఉండదని, రాష్ట్ర వ్యాప్తంగా భూ నిర్వాసితులు, సంఘాలు, కలిసి వచ్చే రాజకీయ పక్షాలతో జేఏసీకి రూపకల్పన చేయాల్సిందిగా మాజీ ఉపకులపతులు కేఎస్ చలం, కేవీ రమణ, తదితరులకు సూచించారు. రాజధాని అమరావతి కోసం భూసమీకరణ పేరిట తీసుకున్న భూములను తిరిగి రాబట్టుకునేలా ఉండవల్లి నుంచి జేఏసీ పోరాటం ప్రారంభిస్తుందని వెల్లడించారు. రైతుల నుంచి భూములు లాక్కునేందుకు ప్రభుత్వం భూ సేకరణ, సమీకరణ వంచి చర్యలకు దిగుతోందని ధ్వజమెత్తారు. రైతుకు మేలు చేకూరేలా కేంద్రం తీసుకువచ్చిన 2013 భూసేకరణ చట్టం అమలు చేసి రైతుకు న్యాయం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టానికి తూట్లు పొడిచేందుకు సవరణలు చేసుకుంటోందని మండిపడ్డారు. తమ హక్కులు కాపాడుకునేందుకు మహారాష్టల్రో రైతులు తలపెట్టిన ఉద్యమం తరహాలో రాష్ట్రం మొత్తం జరుగుతున్న భూ సేకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం జరగాలన్నారు. రాజకీయ, ప్రజాపోరాటం చేయలేని పక్షంలో ఈ తరహా భూ దోపిడీ వ్యవస్థను రూపుమాపలేమని స్పష్టం చేశారు. ఒకప్పుడు గ్రామాలకు రోడ్టేసేందుకు భూములు సేకరించేవారని, ఇప్పుడు రోడ్ల కోసం గ్రామాలనే స్వాదీనం చేసుకుంటున్నారని టీడీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అభివృద్ధి అనేది నియంత్రణతో కూడిన క్రమపద్దతిలో జరగాలని, ప్రస్తుతం అందుకు విరుద్ధంగా సాగుతోందన్నారు. పరిశ్రమలు, ప్రాజెక్టులు, సెజ్‌ల కోసం భూములు సేకరిస్తున్నా, నిర్వాసితులు, స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్‌కేంద్రం ఏర్పాటు వల్ల దేశ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.
గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కాంగ్రెస్ హయాంలో జరిగిన భూ సేకరణను తీవ్రంగా వ్యతిరేకించారని, తాను అధికారంలోకి వస్తే సేకరించిన భూములు తిరిగి రైతులకు ఇస్తానంటూ హామీ ఇచ్చారన్నారు. తీరా అధికారం దక్కిన తరువాత చట్టాలను సవరించి రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అధికార టీడీపీ పూర్తి మద్దతు తెలిపిన తాను అమరావతి భూ సమీకరణ అంశాన్ని వ్యతిరేకిండం ద్వారానే ప్రభుత్వ తీరును ఎండగట్టానని స్పష్టం చేశారు. భూ సేకరణకు వ్యతిరేకంగా మాట్లాడితే అభివృద్ధి నిరోధకులుగా చిత్రీకరిస్తున్నారన్నారు. ప్రభుత్వాలకు రాజకీయ జవాబుదారీ తనం తీసుకువచ్చేందుకు మనం అంతా కలిసికట్టుగా పోరాడుదామంటూ పిలుపునిచ్చారు. సమావేశంలో పర్యావరణ వేత్త, జనసేన ప్రతినిధి బోలిశెట్టి సత్యనారాయణ, ప్రొఫెసర్లు కేవీ రమణ, కేఎస్ చలం, అమరావతి భూ సమీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధి అనుమోలు గాంధీ, ప్రొఫెసర్ సత్యప్రసాద్, తదితరులు పాల్గొనగా, అమరావతి, భోగాపురం, కాకినాడ సెజ్, పోలవరం, భావనపాడు, కొవ్వాడ, బీల, వంశధార, జిందాల్ భూ నిర్వాసితుల ప్రతినిధులు పాల్గొన్నారు.