రాష్ట్రీయం

పది రోజుల్లో డీఎస్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 6: మరో పదిరోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల ఆరున విడుదల కావాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదని వివరించారు. పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను శుక్రవారం విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జూన్ 11నుంచి 25 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించామని, 29,30 తేదీల్లో స్పాట్ వాల్యుయేషన్ జరిగిందని గుర్తుచేశారు. పరీక్షలకు మొత్తం 35వేల 147 మంది అభ్యర్థులు హాజరుకాగా, 18వేల 424 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణత 18.95 శాతం తగ్గిందన్నారు. బాలురు 18440 మంది హాజరుకాగా 9679 మంది, బాలికలలో 16వేల 707కు గాను 8745 మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. బాలురు 52.49శాతం, బాలికలు 52.34 శాతం ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. ఫలితాలను డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బిఎస్‌ఈఏపి.ఓఆర్‌జి వెబ్‌సైట్‌లో పొందుపరిచనట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లా అత్యధికంగా 85.43 శాతంతో ప్రథమ స్థానంలో నిలిస్తే పశ్చిమగోదావరి జిల్లా 16.53శాతంతో చివరి స్థానంలో ఉందని గత సాధారణ పరీక్షలలో కూడా ప్రకాశం ముందంజలో ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. కాగా మిగిలిన జిల్లాల్లో తూర్పుగోదావరి 83.39, అనంతపురం 82.65, కడప 81.85, గుంటూరు 80.84, చిత్తూరు 75.49, విజయనగరం 65.27, కృష్ణా 59.6, విశాఖపట్నం 57.64, కర్నూలు 58.71, శ్రీకాకుళం 53.92, నెల్లూరు 41.03 శాతం ఉత్తీర్ణత సాధించాయని వివరించారు. ఫలితాలు ప్రకటించిన వారం రోజుల్లోపు సబ్జెక్టుకు రూ 500 చెల్లించి రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయించుకోవచ్చని తెలిపారు. రీ వెరిఫికేషన్‌తో పాటు మార్కులువేసిన జవాబుపత్రాలు కావాలంటే వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. కాగా సర్ట్ఫికెట్లు మరో 15 రోజుల్లో అందజేస్తామన్నారు. డీఎస్సీకి సంబంధించి ఆర్థికశాఖ లేవనెత్తిన అభ్యంతరాలను ఆశాఖ సూచించిన విధంగా పరిష్కరిస్తామన్నారు. ఎన్‌సీటీఈ మార్గదర్శక సూత్రాల్లో కూడా కొన్ని మార్పుచేసిన నేపథ్యంలో అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి పదిరోజుల్లోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు. ఉపాధ్యాయ పోస్టులు పెరగవని, గతంలో ప్రకటించినట్లుగానే 10వేల 351 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక డీఎస్సీ ద్వారా సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖలలో పోస్టులు భర్తీ చేస్తారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నీచర్ వంటి వౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన టెండర్లు అధిక ధరలకు కోట్‌చేసినందున జాప్యం జరిగిందన్నారు. తాను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రం విద్యారంగంలో 17 నుంచి 3వ స్థానంలోకి వచ్చిందని చెప్పారు. గణితంలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిషనర్ కె సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.