ఆంధ్రప్రదేశ్‌

విశ్వయోగి బాట అనుసరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు: మానవసేవే మాధవ సేవ అనే సూక్తిని ఆదర్శంగా తీసుకుని విశ్వశాంతికి పాటుపడుతున్న విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ సేవ అనిర్వచనీయమని రాష్ట్ర రోడ్డు భవనాల మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. గుంటూరుకు సమీపంలోని విశ్వనగర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ 72వ జన్మదిన వేడుకల్లో మంత్రి రాఘవరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగతికే స్వామీజీ విశ్వయోగి అని కొనియాడారు. దేశ విదేశాల్లో శాంతి సామరస్యతకు పాటుడుతున్న విశ్వయోగి విశ్వంజీ ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరారు. రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని స్వామి ముందే చెప్పారని పేర్కొన్నారు. విశ్వంజీ విశ్వంలో రుగ్మతలను పారదోలుతున్నట్లుగానే తమ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పేదరికాన్ని పారదోలుతారని అన్నారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ విశ్వంజీ వంటి పవిత్రమూర్తిని కన్న తల్లిదండ్రులు పునీతులయ్యారని అన్నారు. మచిలీపట్నం ఎంపి కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ విశ్వంజీ స్వామిని దర్శించుకోవడం తనకు మధురానుభూతిని మిగిల్చిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యనారాయణ, మోదుగుల బాపిరెడ్డి, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కృష్ణమూర్తి, పివిఆర్‌కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అతిథులు అందరినీ విశ్వంజీ శాలువాలతో సత్కరించి, ఆశీస్సులు అందజేశారు.

భక్తులకు ఆశీర్వచనం అందజేస్తున్న విశ్వయోగి విశ్వంజీ మహరాజ్