రాష్ట్రీయం

ముందస్తు దిశగా వేగం పెంచిన ‘కారు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: ముందస్తు ఎన్నికల దిశగా ‘కారు’ స్పీడ్ పెంచింది. ఒకవైపు ముందస్తుకు అవకాశం లేదని బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేసినప్పటికీ మరోవైపు టీఆర్‌ఎస్ మాత్రం ముందస్తు ఎన్నికలు ఉంటాయనే పార్టీ ఎమ్మెల్యేలకు సంకేతాలు ఇస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికల వ్యూహరచనలో తలమునకలైనట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. పార్టీ ఎమ్మెల్యేలు 62 మంది, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన 23 మంది మొత్తంగా 83 మంది సిట్టింగ్‌ల నియోజక వర్గాల నుంచి తెప్పించుకున్న సర్వే నివేదికలపై కసరత్తు చేస్తోన్నట్టు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేల పని తీరుపై వచ్చిన సర్వేలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మూడు కేటగిరిలుగా విభజించి విజయవకాశాలపై సిఎం కేసీఆర్ కసరత్తు చేస్తోన్నట్టు సమాచారం. మూడు కేటగిరిల్లో 40-50 మంది ఎమ్మెల్యేలు సులువుగా గెలుపొందే అవకాశం ఉండగా, 15-20 మంది ఎమ్మెల్యేలు పని తీరు మెరుగు పర్చుకుంటే బయట పడుతారని, మిగిలిన 10-13 మంది స్థానాల్లో మాత్రం అభ్యర్థులను మార్చాల్సిన పరిస్థితి ఉన్నట్టు సర్వేలో తేలినట్టు సమాచారం. మొదటి, రెండవ కేటగిరిలో ఉన్న ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ నేరుగా ఫోన్ చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు సమాచారం. అయితే విజయవకాశాలు తక్కువగా ఉన్నట్టు తేలిన వారికి మాత్రం సిఎం కేసిఆర్ నుంచి ఫోన్ రాలేదని తెలిసింది. పని తీరు ను మెరుగు పర్చుకోవాలని స్వయం గా పిలిచి చెబుతారా? లేక వారి స్థా నాల్లో కొత్త వారికి టిక్కెట్లు ఇస్తారా? అనేది పార్టీలో చర్చానీయాంశంగా మారింది. అయితే సిట్టింగ్‌లు అందరికీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇస్తామని పార్టీ ప్లీనరీ వేదిక కేసీఆర్ ప్రకటించడంతో మూడవ కేటగిరిలో ఉన్న ఎమ్మెల్యేలను స్వయంగా పిలిపించి మాట్లాడే
అవకాశం ఉన్నట్టు తెలిసింది. మూడు దఫాలుగా జరిపించిన సర్వే నివేదికల ఫీడ్ బ్యాక్‌ను నేరుగా వారి ముందుంచి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. సిఎం కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చిందా? అని ఎమ్మెల్యేలు పరస్పరం ఫోన్లు చేసుకుంటూ ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఫోన్ రాలేదని చెబితే టికెట్ రాదన్న సంకేతాలు వెళ్తాయనే భయంతో కొందరు రాకపోయినా వచ్చినట్టు చెబుతున్నట్టు పార్టీ నేత ఒకరు చెప్పారు. ముందస్తు ఎన్నికలకు అవకాశం లేకపోయినా ఎమ్మెల్యేలు తమ పనితీరును మెరుగు పర్చుకోవడానికి వ్యూహాత్మకంగా సిఎం కేసీఆర్ ముందస్తు బూచి పెడుతున్నట్టు కూడా పార్టీలో మరో ప్రచారం ఉంది.