రాష్ట్రీయం

కౌలు రైతుకు కన్నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 12: ప్రభుత్వాలు ఎన్ని మారినా కౌలు రైతుల కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు. దినదినగండంగా సాగుతున్న వారి బతుకులపై పాలక ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కష్టాలకు కన్నీళ్లే మిగిలాయ. ఓవైపు పెట్టుబడి సాయానికి దూరమె, మరోవైపు బ్యాంకుల్లో రుణాలు లభించక సతమతమవుతున్నారు. అప్పుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ అప్పుల కోసం ప్రదక్షిణలు. ఎలాగోలా అప్పులు చేసి సాగు చేస్తే అతివృష్టి, అనావృష్టితో పంటలు నష్టపోతే ఆదుకునేందుకు ఉన్న రైతు బీమా కూడా వర్తించని దుస్థితి. ఆరుగాలం శ్రమించిన సంపాదన ఇటు భూ యజమానులకు, అటు వడ్డీ వ్యాపారులకే సరిపోతోందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సబ్సిడీలు కౌలు రైతులకు అందని ద్రాక్షగానే మిగిలిపోగా, పట్టాదారుల (్భ యజమానులు)కు మాత్రం లాభపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సొంతంగా భూమి లేకపోయినా కౌలుకు తీసుకుని సాగు చేసుకొనే కౌలు రైతులు సుమారు లక్షన్నర మంది వరకు ఉన్నారు. కౌలు రైతులు భూములను కౌలుకు తీసుకొని ఒక్కొ పంట కాలానికి ఒప్పందం కుదుర్చుకుని నిర్ణీత మొత్తాన్ని పట్టాదారు రైతులకు చెల్లించి పంటలు సాగు చేస్తున్నారు. ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు ఇలా వేలాది రూపాయలు సాగు కోసం పెట్టుబడులు పెడుతున్నారు. తీరా పంట చేతికందే సమయానికి అతివృష్టి లేక అనావృష్టితో పంటలు చేతికందని పరిస్థితుల్లో కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంలో పెట్టుబడి సాయం అందుతుందనుకున్న వారి ఆశలు కూడా ఆడియాశలయ్యాయి. ముఖ్యమంత్రి స్వయంగా కౌలు రైతుకు సాయం ఇవ్వబోమంటూ స్పష్టం చేశారు కూడా. ఇప్పటికే బ్యాంకుల్లో రుణాలివ్వని పరిస్థితులుండగా, తాజాగా కౌలు రైతులకు ఉన్న రుణ అర్హత గుర్తింపు కార్డులను కూడా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బ్యాంకు రుణాలు పూర్తిగా దూరంకానున్నాయి. కనీసం పంటలు నష్టపోతే ఆదుకునేందుకు ఉన్న రైతు బీమా కూడా వర్తించని దుస్థితి. అటు ప్రభుత్వ పెట్టుబడి సాయం, ఇటు కౌలు రైతులు చెల్లించే లీజు డబ్బు పట్టాదారు రైతులకు అందుతోంది. ఇప్పటికే అప్పులపాలవుతూ, నానా తంటాలు పడుతూ సాగు చేస్తున్న తమను కూడా ఏదోరకంగా ఆదుకోవాలంటూ కౌలు రైతులు కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతు సంఘాలు, విపక్ష నేతలు కూడా వారికి సాయమందించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.