రాష్ట్రీయం

ఆర్టీసీ సిబ్బందికి 19% మధ్యంతర భృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీ ప్రస్తుతం 3వేల కోట్ల రూపాయల నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ సంస్థ శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడుతున్న 54వేల మంది ఉద్యోగులు, కార్మికుల కోసం నూతన వేతనాల చెల్లింపు జరిగే వరకు తక్షణం 19శాతం మధ్యంతర భృతి అందించాలని నిర్ణయించినట్టు చైర్మన్ వర్ల రామయ్య ప్రకటించారు. ఆర్టీసీ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన మధ్యంతర భృతి వల్ల సంస్థపై తక్షణం రూ. 250 కోట్లు అదనపు భారం పడుతుందని చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు మించి ఇక్కడ ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామన్నారు. ఆర్టీసీ కార్మికుల వేతన సవరణకు 2017లోనే ప్రత్యేక కమిషన్ వేసినప్పటికీ వేర్వేరు కారణాల వల్ల తాత్సారం జరుగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఐఆర్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న వర్ల రామయ్య