రాష్ట్రీయం

కూలితే ముప్పు.. కూల్చాలంటే అడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న పురాతన భవనాలు ఆందోళనకర స్థితికి చేరాయ. వందేళ్ల నాటి ఈ భవనాల్లో నేటికీ ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతూనే ఉన్నాయ. ఇవి ఎప్పుడు కూలిపోతాయో అంచనావేయలేని పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్ర సచివాలయంలో వందేళ్ల క్రితం నిర్మించిన ‘సర్వహిత’ భవనం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ భవనానికి ‘సర్వహిత’ అనే పేరు పెట్టారు. ఎన్‌టిఆర్ సిఎంగా ఉన్న కాలంలో ఈ భవనం ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు ఈ భవనం చుట్టూ, భవనం గోడలపై మొక్కలు పెరిగి చెట్లుగా మారాయి. కొంతభాగం కూలిపోయింది కూడా. సచివాలయం నట్టనడుమ ఉన్న ఈ భవనం ముందునుండి నడవాలంటేనే భయపడే స్థితిలో ఉంది. ఎప్పుడు కూలుతుందోనన్న భయం సర్వత్రా వెంటాడుతోంది. సర్వహిత చుట్టూ కొత్త భవనాలను నిర్మించారు. నిజాం కాలంలో నిర్మించిన భవనాల్లో ఇదొకటి. సచివాలయంలోనే మరో రెండు పాత భవనాలు ఉండేవి. 20 ఏళ్ల క్రితమే వాటిని కూల్చివేసి వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించారు. సర్వహిత విషయంలో కోర్టులో కేసు ఉండటంతో దీన్ని కూల్చేందుకు అడ్డంకిగా మారింది. పాతభవనాలు కూలిపోయినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం హడావిడి చేస్తున్నప్పటికీ, ఆ తర్వాత వాటివైపు చూసిన దాఖలాలు లేవు. కాగా రాజధానిలో 137 పాత భవనాలను ‘హెరిటేజ్ భవనాలు’గా ప్రభుత్వం గుర్తించింది. హెరిటేజ్ భవనాల్లో చార్మినార్, మక్కామసీద్, కింగ్‌కోటి దవాఖానా, ఉస్మానియా దవాఖానా, పురానీ హవేలీ భవనం, ఫలక్‌నుమా ప్యాలెస్, జూబ్లీహాల్, అసెంబ్లీ పాతభవనం, హైకోర్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కాలేజీ, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ భవనం, మొజంజాహి మార్కెట్, ఎర్రమంజిల్ (ప్రస్తుతం ఇంజనీరింగ్ కార్యాలయాలున్నాయి) తదితర భవనాలు ఉన్నాయి. వీటితో పాటు తెలంగాణలోని వివిధ పట్టణాల్లో అనేక పురాతన భవనాలున్నాయి. దేవరకొండ ఫోర్ట్, గద్వాల రాజావారి భవనం, కొల్లాపూర్‌లో రాజావారి భవనంతో పాటు ఇతర భవనాలు, వనపర్తిలో రాజావారి భవనంతో సహా రాష్ట్రంలో దాదాపు 306 ప్రధానమైన పురాతన భవనాలను నేటికీ వినియోగంలోనే ఉన్నాయ. వివిధ పట్టణాల్లో నిజాంకాలంలో నిర్మించిన భవనాలను దవాఖానాలుగా, డాక్‌బంగ్లా (గెస్ట్‌హౌజ్) లుగా, పాఠశాలలుగా, తహశీల్‌దార్ కార్యాలయాలు, కోర్టులుగా ఇతర కార్యాలయాలుగా వినియోగిస్తున్నారు. వాస్తవానికి ఈ భవనాల్లో చాలా భవనాలు నేటికీ పటిష్టంగానే ఉన్నప్పటికీ, కొన్ని భవనాలు మాత్రం నిర్వహణ జాప్యంతో సరిగాలేక కూలిపోయే దశకు వచ్చాయి. ఇనుపరాడ్లు, సున్నం, ఇసుక కలిపి శ్లాబుగా వేసిన పురాతన భవనాలు వర్షపునీటికి నాని కూలిపోతున్నాయి. కూలిపోయే దశలో ఉన్నవాటిని ముందుగానే పసిగట్టి తగిన చర్యలు తీసుకుంటే ప్రాణనష్టం నివారించేందుకు వీలవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
హెరిటేజ్ చట్టం
కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం 2017లో హెరిటేజ్ బిల్లును శాసనసభలో ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం హెరిటేజ్ భవనాలు, హెరిటేజ్ ప్రాంతాలుగా గుర్తించిన వాటిని పునర్నిర్మించడం, మరమ్మతులు చేయడం చేయాలని నిర్ణయించారు. హెరిటేజ్ భవనాలు, ఇతర నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ఈ బిల్లు ఆమోదం సందర్భంగా హామీ ఇచ్చారు. ‘తెలంగాణ స్టేట్ హెరిటేజ్ అథారిటీ’ని (టిఎస్‌హెచ్‌ఏ) కూడా ఏర్పాటు చేయాలని బిల్లులో పొందుపరిచినప్పటికీ, హెరిటేజ్ అథారిటీ ఏర్పాటు కాలేదు. హెరిటేజ్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ, కమిటీ ఏర్పాటు కాలేదు. కూలిపోయే దశలో ఉన్న పాతభవనాలను గుర్తించి, వినియోగించడం మానివేయడమో, కూల్చివేయడమో చేస్తే ప్రాణహానీ తప్పించినట్టవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

చిత్రం..రాష్ట్ర సచివాలయంలో పురాతన భవనం (సర్వహిత)-ఎన్‌టిఆర్ సీఎంగా ఉండగా ఈ భవనాన్ని సీఎం కార్యాలయంగా ఉపయోగించారు