రాష్ట్రీయం

శే్వత విప్లవానికి రూ.1677 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచడంతో పాటు రైతులకు ఆర్థికంగా లాభం చేకూర్చేందుకు ఉద్దేశించిన ‘శే్వత విప్లవాని’కి ప్రభుత్వం 1677.11 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. జాతీయ స్థాయిలో వినూత్న పథకంగా దీన్ని పేర్కొనవచ్చు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రారంభించిన పథకాల్లో దీన్ని విప్లవాత్మక పథకంగా నిపుణులు పేర్కొంటున్నారు. శాస్ర్తియ విధానంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. 2018-19 నుండి 2019-20 సంవత్సరాల్లో (రెండేళ్లలో) ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు మార్గదర్శకాలను రూపొందించారు. పశు సంవర్థక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేరుతో మంగళవారం మార్గదర్శకాలు వెలువడ్డాయి.
తెలంగాణ విజయ డెయిరీ, నల్లగొండ- రంగారెడ్డి (నార్ముల్) డెయిరీ, ముల్కనూర్ మహిళా డెయిరీ, కరీంనగర్ డెయిరీ యాజమాన్యాలు గుర్తించిన 2.13 లక్షల మందికి ఒక్కొక్కరికి ఒక పాడి పశువును పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాడిపశువుల పంపిణీలో భాగంగా ఒక్కో పాడిపశువుకు 80 వేల రూపాయలు యూనిట్ కాస్ట్‌గా నిర్ణయించారు. యూనిట్ కాస్ట్‌కు అదనంగా రవాణా, లాజిస్టిక్ ఖర్చులకు ప్రభుత్వం ఐదువేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు.
యూనిట్ కాస్ట్‌లో పాడిపశువు ధర, మూడేళ్లపాటు బీమా ప్రీమియం, 300 కిలోల దాణాను (మూడునెలల పాటు సరిపోతుంది) కూడా కలిపారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ‘శే్వతవిప్లవం’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. యూనిట్ కాస్ట్‌లో ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం (60 వేల రూపాయలు) సబ్సిడీగా ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 20 వేల రూపాయలు లబ్దిదారుడు భరించాల్సి ఉంటుంది. బీసీలు, ఇతర వర్గాల వారికి యాభై శాతం సబ్సిడీగా ఇస్తారు. అంటే రూ.40 వేలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందని, మిగతా 40 వేల రూపాయలు లబ్దిదారుడు భరించాలని స్పష్టం చేశారు. పాడిపశువులను ఎక్కడి నుండైనా, ఏ రకమైన పాడిపశువునైనా కొనుగోలు చేసే స్వేచ్ఛ లబ్దిదారుడికి ఉంటుంది. పశుసంవర్థక శాఖ ఈ విషయంలో జోక్యం చేసుకోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాడిపశువులను కొనుగోలు చేసిన చోట నుండి రైతు ఇంటికి చేర్చేందుకు రవాణా సౌకర్యాన్ని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేస్తారని వివరించారు.
రాష్టస్థ్రాయిలో ‘విజయ డెయిరీ’ ఫెడరేషన్ ద్వారా ఈ పథకానికి నిధులు సమకూరుస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో సంబంధిత డెయిరీ సంస్థల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మండలస్థాయిలో తహశీల్దార్, ఎంపీడీఓ, డెయిరీ సంస్థ ప్రతినిధి, పశువైద్య అధికారులతో కూడిన కమిటీ క్షేత్రస్థాయిలో పథకాన్ని అమలు చేస్తుంది. అవినీతికి ఆస్కారం లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. కొనుగోలు చేసిన పాడిపశువుకు మూడేళ్లపాటు బీమా సౌకర్యం కల్పిస్తారు. ప్రతిపాడిపశువుకు వివిధ వ్యాధులు సోకకుండా టీకాలు వేయించాల్సి ఉంటుంది.మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేయడంతో ప్రణాళిక అమల్లోకి వచ్చినట్టయింది. ఈ నెల 23 న బీమా ప్రీమియం రేట్లు నిర్ణయిస్తారు. ఈ నెల 20 నుండి 26 వరకు లబ్దిదారులకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తారు. 26 న రవాణా ఏర్పాట్లు చేస్తారు. ఆగస్టు 1 నుండి పాడిపశువుల కొనుగోలు ప్రారంభం అవుతుంది.