రాష్ట్రీయం

ఉస్మానియా వర్శిటీలో ఆన్‌లైన్ మూల్యాంకనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో యూజీ, పీజీ విద్యార్ధుల జవాబుపత్రాలను ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే ఈ ప్రక్రియను జేఎన్‌టీయూ చేపట్టగా, తెలంగాణలోని సంప్రదాయ వర్శిటీల్లో ఆన్‌లైన్ మూల్యాంకనం చేపట్టిన తొలి యూనివర్శిటీగా ఉస్మానియా యూనివర్శిటీ ఖ్యాతి గడించింది. గత కొద్ది సంవత్సరాలుగా అన్ని సేవలనూ ఆన్‌లైన్‌లో అందిస్తు న్న ఉస్మానియా రానున్న రోజుల్లో 16 లక్షలకు పైగా ఉండే జవాబుపత్రాలను ఆన్‌లైన్‌లోనే మూ ల్యాంకనం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో తొలి దశలో 80వేల ఎంబీఏ జవాబుపత్రాలను ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రతి జవాబు పత్రం కనీసం 32 పేజీలు ఉంటుంది. అలాంటి జవాబు పత్రాలను గతంలో కోడింగ్ చేసి మూల్యాంకనానికి పంపించడం, తర్వాత వాటిని మరోమారు డీ కోడింగ్ చేసి మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయడం జరిగేది. కానీ, నేడు జవాబుపత్రాలను కంప్యూటర్ ద్వారా కోడింగ్ చేసి స్కానింగ్ చేసి సెంట్రల్ సెర్వర్‌లోకి అప్‌లోడ్ చేస్తారు. అవి మూల్యాంకనం చేసేందుకు ఎంపిక చేసిన అధ్యాపకులకు అందుబాటులో ఉంటాయి. వారికి ప్రత్యేకించి ఒక ఐడీ, పాస్‌వర్టు ఇస్తారు. అలాగే వారి పాస్‌వర్టుకు వెరిఫికేషన్‌గా ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఆధారంగా ఆయా అధ్యాపకులను నిర్ధారించి, వారికి స్కాన్డ్ జవాబుపత్రాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. వాటిని వారు డౌన్‌లోడ్ చేసుకుని తామున్న చోటనే మూల్యాంకనం చేయవచ్చు. ఒకొక్కరికీ రోజుకు కనీసం 30 నుండి 60 వరకూ జవాబు పత్రాలు ఇస్తారు. దీనివల్ల సమయం కలిసొస్తుంది. వారు ఉస్మానియా యూనివర్శిటీ మూల్యాంకనం కేంద్రాలకు రావల్సిన అవసరం ఉండదు. ఆయా అధ్యాపకులు తమకు నచ్చిన సమయంలోనే వీటిని మూల్యాంకనం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఫలితంగా అందరికీ అనువుగా ఉంటుందని వర్శిటీ అధికారులు చెబుతున్నారు. మరో పక్క మార్కులు నమోదు చేయగానే వెంటనే కంప్యూటర్ తనంతట తానే గణించే విధంగా సాఫ్ట్‌వేర్ రూపొందించామని వర్శిటీ అధికారులు పేర్కొన్నారు. త్వరలో ఈ ప్రక్రియను యూజీ, పీజీ కోర్సులకు కూడా వర్తింపచేస్తామని అన్నారు. దీనివల్ల ఫలితాలను కూడా చాలా తక్కువ వ్యవధిలోనే వెల్లడించేందుకు వీలవుతుందని కంట్రోలర్ ప్రొఫెసర్ ఎం కుమార్ వివరించారు. అలాగే ఏదైనా సమాచారం కావానుకున్నా దానిని తిరిగి వినియోగించుకునే వీలుంటుందని సంప్రదాయ పద్ధతిలో ఒక జవాబుపత్రం వెదకాలంటే చాలా సమయం పట్టేదని అన్నారు. నిపుణుల సేవలు , సమయం, వేగం అన్నీ ఇందులో ఇమిడి ఉంటాయని, దీనివల్ల వర్శిటీ పనితీరు ఎంతో మెరుగుపడుతుందని ఆయన చెప్పారు.