రాష్ట్రీయం

సమస్యలన్నీ పరిష్కరించాకే ఓట్లు అడుగుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంట, జూలై 18: ప్రజాసమస్యలు పరిష్కరించాకే ఓట్లు అడుగుతామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గ్రామదర్శిని-గ్రామవికాసం కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలంలోని గాంధీబొమ్మల సెంటర్‌లో బుధవారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడారు. అక్టోబర్ నుంచి రూ.1000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. దొంగ అబ్బాయి వచ్చి మనం వేయించిన రోడ్లు, వీధిలైట్లు కింద పాదయాత్రలు చేస్తున్నారని, అంతేకాక 27 ఫోర్ ట్వంటీ కేసులుండీ చంద్రబాబుపై అనేక ఆరోపణలు చేయడం దురదృష్టకరమని జగన్‌పై ధ్వజమెత్తారు. తనపై కూడా ఆరోపణలు చేశారని, వాటిని నిరూపించాలని లోకేష్ సవాల్‌చేశారు. పాదయాత్ర చేస్తున్న జగన్ ఎక్కడా ప్రధాని నరేంద్రమోదీ గురించి మాట్లాడటం లేదని, అలా మాట్లాడితే జైల్లో పెడతారని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అంటే తనకు గౌరవముందని, కానీ ఆయన కూడా తనపై లేనిపోని ఆరోపణలు చేయడం దారుణమన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 30 ఏళ్ల పరిపాలనానుభవంతో రాష్ట్భ్రావృద్ధికి చంద్రబాబు యువకులతో సమానంగా పోటీపడుతూ పనిచేస్తున్నారన్నారు. పల్లెటూళ్లకు సేవచేస్తే పరమాత్మునికి సేవ చేసినట్టేనని తన తండ్రి చంద్రబాబు చెబుతూ ఉండేవారని, అందుకే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పదవి తీసుకుని గ్రామీణ ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు.
సంక్షేమం-అభివృద్ధి టీడీపీకి జోడెద్దుల బండి లాంటిదన్నారు. వచ్చే ఎన్నికల్లో 25 లోక్‌సభ సీట్లు గెలిచి భారత ప్రధానిని మనమే నిర్ణయించబోతున్నామన్నారు. విభజన హామీల్లో 18 అంశాలపై కేంద్రం ఇచ్చిన హామీలను అమలుచేయించే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందన్నారు. ఎన్నికల వేడి మొదలయ్యిందని, కొందరు కులం, మతం, ప్రాంతం పేరుతో చిచ్చుపెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాయలసీమ డిక్లరేషన్ అని, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం అని ఒకరు, తిరుపతి వేంకటేశ్వరుని నగలు కొట్టేశామని మరొకరు దారుణమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. డ్వాక్రా సంఘాల్లోని ప్రతీ మహిళకు రూ.8వేలు బ్యాంకు ఖాతాలో జమచేశామన్నారు. పింఛన్ ఏడాదికి రూ.12వేలు ఇస్తున్నామని. ఏపీలో 54 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. చంద్రన్న బీమా ద్వారా రూ.5లక్షలు ఇచ్చి ఆదుకుంటున్నామన్నారు. చంద్రన్న పెళ్లికానుక కూడా అందిస్తున్నామన్నారు. అన్న కాంటీన్ల ద్వారా రోజుకు రూ.15 ఖర్చుతో బ్రహ్మాండమైన అల్పాహారం, భోజనం పెడుతున్నామన్నారు.
కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్, ఎమ్మెల్యేలు పీతల సుజాత, నిమ్మల రామానాయుడు, బండారు మాధవనాయుడు, వేటుకూరి శివరామరాజు, సర్పంచ్ యాదాల ఆశాజ్యోతి, ప్రభుత్వ విప్ అంగర రామ్మోహనరావు, ఎమ్మెల్సీ షరీష్, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డీసీసీబీ ఛైర్మన్ ముత్యాల రత్నం, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పాలి ప్రసాద్, ఫిషర్‌మెన్ కమిటీ ఛైర్మన్ చల్లారావు తదితరులు పాల్గొన్నారు.