రాష్ట్రీయం

నల్లమలలో ఫ్లయింగ్ స్నేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, జూలై 18: నల్లమల ప్రాంతంలో అరుదైన శ్రీలంకన్ ఫ్లయింగ్ స్నేక్‌ను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. శ్రీశైలంలోని శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయం సమీపంలో ఓ ఇంట్లో ఈ పాము కనిపించింది. ఇంటిపరసరాల్లో తిరుగుతున్న పామును గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని దాన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి మురళీకృష్ణ, ప్రేమ మాట్లాడుతూ 2015లో ఇలాంటి పాము శేషాచలం అడవుల్లో లభ్యమైందన్నారు. ఆ తరువాత హైదరాబాదులో మరోసారి లభ్యమైందని తెలిపారు. ఇంతవరకు నల్లమల అడవుల్లో ఇలాంటి పాము కనిపించలేదన్నారు. 1943లో శ్రీలంక అడవుల్లో ఫ్లయింగ్ స్నేక్‌ను గుర్తించారన్నారు. రెండు అడుగులు పొడవు ఉండే ఈ పాము చిన్నపాటి క్రిమికీటకాలు, జీవరాసులను ఆహారంగా తీసుకుంటుందని తెలిపారు. మొదటిసారిగా ఫ్లయింగ్ స్నేక్ నల్లమలలో లభించడం అరుదైన రికార్డు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌బీఓ ఠాగూర్, ల్యాబ్ సిబ్బంది ఉన్నారు.