రాష్ట్రీయం

జూరాలనుంచి ఎగసిపడిన కృష్ణమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 18: రాష్ట్రంలో కృష్ణానదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు జూరాల జలాశయం నుండి కృష్ణా జలాలను బుధవారం ఎత్తిపోసే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి గేట్లు ఎత్తివేయడంతో నారాయణపూర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుడడంతో ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. నారాయణపూర్ డ్యాంలో విద్యుదుత్పత్తి ప్రారంభం కావడంతో అందుకు విడుదల చేసిన నీరు కృష్ణానది నుండి జూరాల ప్రాజెక్టులోకి దాదాపు ఐదు వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది. దాంతో ముందస్తు చర్యగా జోగుళాంబ గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు, మహబూబ్‌నగర్ జిల్లాలో భీమా ఫేజ్-1, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ఒక్కో మోటార్‌ను బుధవారం రన్ చేశారు. జూరాల జలాశయం నుండి బ్యాక్‌వాటర్ చిన్నగోప్లాపూర్ దగ్గర భీమా పేజ్-1 ఒక మోటార్ ద్వారా మొదటి రోజు 450 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. దాంతో భూత్పూర్ రిజర్వాయర్‌లోకి కృష్ణానది నీరు పరుగులు తీస్తోంది. 450 క్యూసెక్కుల నీటిని జూరాల జలాశయం నుండి ఎత్తిపోస్తుండడంతో రెండు రిజర్వాయర్లను ఒకేసారి నింపాలని అధికారులు భావించి సంగంబండ రిజర్వాయర్లలోకి కూడా కృష్ణానది నీటిని కూడా తరలిస్తున్నారు. అదేవిధంగా మరో ఎత్తిపోతల పథకం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు మోటర్ రన్ కావడంతో ఉంద్యాల దగ్గర కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. పర్ధిపూర్ రిజర్వాయర్‌లోకి దాదాపు 315 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు.
అంతేకాకుండా నెట్టెంపాడుకు సంబంధించిన ఒక మోటారును రన్ చేయడంతో జూరాల జలాశయం నుండి 750 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. బుధవారం జూరాల జలాశయం నుండి దాదాపు 1,515 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. దాంతో భూత్పూర్, ర్యాలంపాడు, సంగంబండ, పర్ధిపూర్ రిజర్వాయర్లకు రెండు మూడు రోజుల్లో పూర్తిగా జలకళ సంతరించుకోనుంది. ఇక్కడ వర్షాలు కురవకపోయనా కర్నాటక, మహారాష్టల్రో భారీ వర్షాల వల్ల ఆల్మట్టి ప్రాజెక్టుకు దాదాపు 1.26 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది.