రాష్ట్రీయం

ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 19: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని సీడబ్ల్యుసీ సభ్యుడు, ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఊమెన్ చాందీ అన్నారు. విశాఖ నగరంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం గురువారం ఇక్కడ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చాందీ మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, వైసీపీలు ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం పట్ల ఇక్కడి ప్రజలు బీజేపీపై అసంతృప్తితో ఉన్నారని అన్నారు. హోదా తీసుకురావడంలో విఫలమైన తెలుగుదేశం పార్టీపైన కూడా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చాందీ అన్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి వలస వెళతారని ప్రచారం జరుగుతోందని, తాను ఇటీవల రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పర్యటించానని, కానీ పార్టీని విడిచి వెళ్లడానికి ఏ ఒక్కరూ ఇష్టపడడం లేదని ఆయన స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతోందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ఫైలుపై రాహుల్‌గాంధీ సంతకం చేస్తారని ఆయన చెప్పారు. అలాగే, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ కార్యదర్శి క్రిష్ట్ఫోర్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో టీడీపీ విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజా సంక్షేమాన్ని చూసేదని అన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో కొత్త శకం ఆరంభం కానుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే పార్టీలన్నింటినీ ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం ఎన్‌ఎస్‌యుఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నామని ఆయన చెప్పారు.
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ మోదీకి దాసోహమని, ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిందని విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మన రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని అన్నారు. దేశంలో రాజకీయం ఒక కీలక దశకు చేరుకుంది. రాజ్యాంగంపై విశ్వాసం, ప్రజల బాగోగులు కాంక్షించేవారు మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, విభజన చట్టంలో రూపొందించిన ప్రతి అంశాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలుచేస్తామని రఘువీరారెడ్డి చెప్పారు. మోదీపై పెట్టిన అవిశ్వాసానికి మద్దతు తెలుపుతూ శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా మానవహారాలు నిర్వహించనున్నట్టు రఘువీరారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతా మోహన్, ద్రోణంరాజు శ్రీనివాస్, కిల్లి కృపారాణి, మాజీ మంత్రి బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.