రాష్ట్రీయం

పథకాలు కేంద్రానివి ప్రచారం బాబుది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 22: పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వానివి, ప్రచారం మాత్రం చంద్రబాబుదని, ఇదంతా సొమ్మొకరిది, సోకొకరిది అన్నట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాష్ట్రంపై ఉన్న అభిమానంతో ఎంత ఖర్చయినా వెనుకాడకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులిస్తుంటే అందులోనూ చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు అవినీతి, అక్రమాలు, తప్పులను కప్పిపుచ్చుకోడానికే కేంద్రంపై అవిశ్వాసం పెట్టారని ధ్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మోర్చా జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీని ఆదివారం నగరంలో సన్మానించారు. ఈసందర్భంగా జరిగిన సభలో ముఖ్యఅతిథిగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అవినీతి రహిత పాలన, సంపూర్ణ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ లక్ష్యమని చెప్పారు. బీమా పథకానికి పూర్తిగా కేంద్రం నిధులిస్తుండగా చంద్రన్న బీమా పథకంగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. మహిళల ఆత్మగౌరవం పరిరక్షించేందుకు ఒక్కో యూనిట్ రూ. 13వేలతో మరుగుదొడ్లు కేంద్రం నిర్మిస్తుంటే అందులోనూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గృహ నిర్మాణానికి ఇచ్చిన నిధులను దుర్వినియోగపరిచారన్నారు. సామాన్య కుటుంబానికి చెందిన ప్రధాని మోదీ అంచలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరారని, ఆయనను ఎదుర్కోలేకనే ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయన్నారు. అయినా ఎవరూ ఏమీ చేయలేరన్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ ఎందుకు, ఎలా సమర్థించిందో అర్థంకావటం లేదన్నారు. బాబు ఓవైపు కేంద్రం ఇచ్చే నిధులను తీసుకుంటూనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
పచ్చి అబద్ధాలాడుతున్న బాబు సీఎంగా కొనసాగే అర్హత కోల్పోయాడని విమర్శించారు. రాష్ట్రంలో జన్మభూమి పేరిట బ్రోకర్ల పాలన సాగుతోందని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. కార్యక్రమానికి మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెహబూబ్ అధ్యక్షత వహించారు. బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కుమరస్వామి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, దాసం ఉమామహేశ్వరరాజు పాల్గొన్నారు.
చిత్రం..సభలో మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ