రాష్ట్రీయం

రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: ‘రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదు, అందుకే విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలపై పార్లమెంట్‌లో తమ నిరసన గళాన్ని కేంద్రానికి వినిపించాం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌కు చెప్పారు. ‘మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అందుకే కేంద్రంతో ఘర్షణ వైఖరి తగదనే ఓటింగ్‌కు దూరంగా ఉన్నాం’ అని కూడా వ్యాఖ్యానించినట్టు సమాచారం. సీఎం కేసీఆర్ ఆదివారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ప్రధానంగా పార్లమెంట్‌లో జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు వచ్చినట్టు తెలిసింది.
‘అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు పెట్టారో, వారి నిజ స్వరూపం ఏమిటో ప్రధాని కూడా అర్థం చేసుకున్నారు. వారి గురించి మాకు బాగా తెలుసుకాబట్టే వారు పన్నిన ఉచ్చులో పడకుంటా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించాం’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం, తాజా రాజకీయ పరిస్థితి, రాష్ట్రంలో కంటి వెలుగు, హరితహారం కార్యక్రమాలు తదితర అంశాలు గవర్నర్‌తో సీఎం జరిపిన భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. తెలుగు రాష్ట్రాల మధ్య పేచీలు వచ్చినప్పుడు తాను, గవర్నర్ రాజీ చేయడానికి ప్రయత్నించినట్టు పార్లమెంట్‌లో ప్రధాని చేసిన వ్యాఖ్యలను సీఎం గుర్తు చేసినట్టు తెలిసింది. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు, అలాగే ఈ నెల 27న ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా గవర్నర్‌ను కేసీఆర్ ఆహ్వానించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల నియామకం అయిన టి రాదాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రాష్ట్ర పురోగతి, సాధించిన విజయాలు, సామాజిక కార్యక్రమాలను ఈ సందర్భంగా సిఎం వివరించినట్టు తెలిసింది.

చిత్రం..రాజ్‌భవన్‌లో ఆదివారం గవర్నర్‌ను కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్