రాష్ట్రీయం

అభ్యర్థుల ఎంపికలో జాప్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: సార్వత్రిక ఎన్నికలకు చాలా రోజుల ముందుగానే అభ్యర్థుల ఎంపికలో జాప్యం చేయకుండా ముందుగానే ప్రకటించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానాన్ని కోరారు. రాహుల్ గాంధీ ఎఐసిసి అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆదివారం ఢిల్లీలో తొలిసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు సీఎల్‌పీ నేత కె. జానారెడ్డి, కౌన్సిల్‌లోప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపీ హనుమంత రావు తదితరులు హాజరయ్యారు. సమావేశానంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపిక ముందే జరిగితే చివరి నిమిషం వరకు అయోమ యం, టెన్షన్ ఉండదన్నారు. ఈ విషయానే తాను సీడబ్ల్యూసీ సమావేశంలో
సూచన చేశానని ఆయన చెప్పారు. అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే తమ పార్టీ అభ్యర్థులను, ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తున్నదని ఆయన తెలిపారు. చివరి నిమషంలో ప్రకటించడం ద్వారా అభ్యర్థులకు ప్రచారానికి కావాల్సినంత సమయం లభించడం లేదన్నారు. పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రచారం మొదలైన తర్వాత విడుదల చేయడం ద్వారా, అందులోని ప్రాధాన్యత గల అంశాలు (హామీలు) ప్రజల్లోకి వెళ్ళడం లేదని తాను చెప్పానని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో)లో కాంగ్రెస్ ఏమేమీ హామీలు ఇచ్చిందోనని ప్రజలు ఆదుర్థాగా ఎదురు చూస్తారని ఆయన అన్నారు. కాబట్టి ఎన్నికల ప్రణాళికనూ ముందుగానే ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా రైతులందరికీ పంట బీమా సౌకర్యం కల్పించాలని, రైతులపై భారం లేకుండా ఉండేందుకు బీమా పథకం ఉపయోగపడాలని తాను సమావేశంలో సూచించానని ఆయన చెప్పారు. పార్టీ నాయకులు వివిధ స్థాయిల్లో జరుపుకునే క్లోజ్‌డ్ డోర్ సమావేశాల వివరాలను మీడియాకు తెలియడం వల్ల పార్టీకి కొంత నష్టం జరుగుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి అటువంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరానని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.