రాష్ట్రీయం

పర్యావరణ సదస్సుకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అమెరికాలో నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ సదస్సు (గ్లోబల్ క్లైమెట్ యాక్షన్ సమిట్)కు రావాల్సిందిగా కాలిఫోర్నియా గవర్నర్ నుంచి ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఆహ్వానం అందింది. సదస్సులో పాల్గొనాలంటూ కాలిఫోర్నియా గవర్నర్ ఎడ్మండ్ జి బ్రౌన్ కేటీఆర్‌కు లేఖ రాసారు. సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ఫ్రాన్సిస్కోలో సదస్సు జరుగుతుందని అందులో పేర్కొన్నారు. ‘్ఫ్యచర్ ఆఫ్ ఎనర్జీ అండ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్’ అనే అంశంపై ప్రసంగించాల్సిందిగా లేఖలో కేటీఆర్‌ను కోరారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రభుత్వామ నుంచి ప్రతినిధులతో పాటు వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తున్న వారు హాజరు కానున్నారని ఆహ్వాన లేఖలో వివరించారు.