ఆంధ్రప్రదేశ్‌

గజ వాహనంపై గరళకంఠుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆదిదంపతులు గజ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రోజూ మాదిరిగానే స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అక్కమహాదేవి అలంకరణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించి ఆలయ వేద పండితులు విశేష పూజలు చేశారు. సాయంత్రం శ్రీ పార్వతీపరమేశ్వరులను గజ వాహనంపై ఆశీనులను చేసి శ్రీశైలం పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీశైలం జద్గురువు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. కాగా సోమవారం స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం, నందివాహన సేవ నిర్వహిస్తారు. రాత్రి లింగోద్భవకాలం, మహారుద్రాభిషేకం అనంతరం పాగాలంకరణ, రాత్రి 12 గంటల తరువాత స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మహానందిలో గ్రామోత్సవం
మహానంది : మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండో రోజు శ్రీకామేశ్వరీ సమేత మహానందీశ్వరుల స్వామివార్లు ఉదయం సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం మయూర వాహనంపై మహానంది పురవీధుల్లో విహరించారు.

శ్రీశైలంలో ఆదిదంపతులకు గజ వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం