రాష్ట్రీయం

చట్టాలు మార్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నాలుగేళ్లు కావస్తున్నా పలు శాఖలు చట్టాలు మార్చుకోకపోవడంతో రానున్న రోజుల్లో న్యాయవివాదాలు చెలరేగే పరిస్థితి ఉందని న్యాయశాఖ ఆదేశించింది. తక్షణమే తమ తమ శాఖల పరిధిలోని చట్టాలను మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా విద్యాశాఖ ఆధీనంలోని పలు సొసైటీలు, యూనివర్శిటీలు వేర్వేరు చట్టాలను రూపొందించుకోవల్సి ఉంది. సంప్రదాయ వర్శిటీలకు ఒకే చట్టం వర్తిస్తున్నా, స్పెషాలిటీ వర్శిటీలకు మాత్రం వేర్వేరు చట్టాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ, వ్యవసాయ వర్శిటీ, హార్టికల్చర్ వర్శిటీ, హెల్త్ యూనివర్శిటీ, జెఎన్‌టీయూహెచ్, జెఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్సు యూనివర్శిటీ, ఆర్‌జీయూకేటీలకు వేర్వేరు చట్టాలను రూపొందించాలి. వీటితో పాటు వివిధ యూనివర్శిటీల పరిధిని కూడా నిర్ధారించాల్సి ఉంది. గతంలో ఉన్న పరిధితోనే ప్రస్తుత వర్శిటీలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం జిల్లాలు, డివిజన్లు, పంచాయతీల పునర్విభజన జరగడంతో వివిధ వర్శిటీల పరిధిని నవీకరిస్తూ నోటిఫై చేయాల్సి ఉంటుంది. ప్రాంతీయ పరిధిని స్పష్టం చేయడంతో పాటు , కాలం చెల్లిన చట్టాలను పక్కన పడేసి, కొత్త అవసరాలకు అనుగుణంగా చట్టాల్లో కొన్ని మార్పులు చేసుకోవలసి ఉంటుంది. అలాగే ఇంజనీరింగ్, ఎంబీఎ, ఎంసీఎ కాలేజీలు ఇటు ఉస్మానియా, అటు వరంగల్ కాకతీయ, తెలంగాణ యూనివర్శిటీలకు అనుబంధంగా ఉన్నాయి, రానున్నరోజుల్లో వీటన్నింటినీ స్పెషాలిటీ వర్శిటీల పరిధిలోకి తీసుకురావాలనే యోచనలో ఉన్నత విద్యాశాఖ ఉంది.