రాష్ట్రీయం

ప్రచారానికి పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: విభజన కారణంగా ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఊపిరిపోసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ కథ కంచికే అన్న భావన ఏర్పడిన తరుణంలో ప్రత్యేక హోదాపై రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపడంతో దీన్ని అవకాశంగా తీసుకుని బలపడేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇటీవలి కాలంలో ఆపరేషన్ స్వగృహను ప్రారంభించిన ఆ పార్టీ జిల్లాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించి వారిలో పార్టీ మళ్లీ ప్రాణం పోసుకోనుందన్న నమ్మకాన్ని కల్పించే దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా ప్రజలను తిరిగి తమ వైపు తిప్పుకునేందుకు వాడవాడలా ప్రచారం కార్యక్రమాలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు. గ్రామాలు,
పట్టణాలు అన్న తేడా లేకుండా అన్ని చోట్ల వీధికూడలి ప్రదేశాలు, అభిమానుల ఇళ్ల వద్ద పార్టీ గతంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, భవిష్యత్తులో చేపట్టే పథకాలను ప్రచారం చేయడానికి దీర్ఘకాలం మనే్న బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. పనిలో పనిగా రాష్ట్ర విభజన పాపం తమ ఒక్కరిదే కాదని అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినందునే సాధ్యమైందని కూడా ప్రజలకు వివరించనున్నారు. విభజనలో జరిగిన అన్యాయాన్ని కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పూరించగలదని సదరు బోర్డుల్లో ప్రజలకు చెప్పుకోనున్నారు. వీధి కూడళ్ల వద్ద బోర్డులతోనే కాకుండా కరపత్రాల పంపిణీ, వీలైన చోట్ల కార్యకర్తల ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు రానున్న వారం, పది రోజుల్లో అన్ని చోట్ల పార్టీ ప్రచార హోర్డింగులు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ నాయకుల ద్వారా తెలుస్తోంది.