రాష్ట్రీయం

న్యాయం చేయకపోవటం యూటర్న్ కాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 27: విభజన చట్టప్రకారం రాష్ట్రానికి రావాల్సినవి కేటాయించకుండా, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా విస్మరించడం యూటర్న్ తీసుకోవటం కాదా అని కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దఎత్తున కేటాయింపులు జరుపుతూ మరోవైపు విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునే విషయంలో వివక్ష ప్రదర్శించటమే ఇందుకు నిదర్శనమన్నారు. శుక్రవారం ఎంపీలతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటుకు సోమవారం వరకు సెలవుల కారణంగా ప్రజాక్షేత్రంలో కేంద్రాన్ని ఎండగట్టాలని నిర్దేశించారు. మీరు చేసిన పోరాటాలకు ప్రజల నుంచి ప్రశంసలు వచ్చాయి.. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని అత్యున్నత చట్టసభల్లో ఎండగట్టారు.. పార్లమెంటులో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.. కేంద్రం ఒంటెత్తు విధానాలను నిలదీయటంతో పాటు బీజేపీ కుటిల యత్నాలను బహిర్గతపరిచారని ఎంపీలకు కితాబిచ్చారు. మా సంపద కావాలి.. వనరులు కావాలి.. ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చరా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. పునర్విభజన చట్టం అమలులో ఎందుకు నిర్లక్ష్యం చేశారో ప్రజలకు వివరిస్తామని స్పష్టంచేశారు. ఐదుకోట్ల మంది ప్రజల ఆకాంక్షలు పార్లమెంటులో ప్రతిధ్వనించేలా ఇకపై సమావేశాల్లో ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని ఎంపీలకు హితవు పలికారు. టీడీపీది యూటర్న్‌కాదు..రైట్ టర్న్ అని వ్యాఖ్యానించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీగా ప్రకటించిన రూ 350 కోట్లు వెనక్కు తీసుకోవటం యూటర్న్ కాదా అని నిలదీశారు. మేనిఫెస్టోలో చెప్పింది చేయకపోవటం.. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకపోవటంపై ఏ రకంగా వ్యాఖ్యానిస్తారో తేల్చాలన్నారు. రాజస్థాన్ పెట్రో కాంప్లెక్స్‌కు రూ 5615కోట్లు కేటాయించి ఏపీకి మనమే కట్టుకోవాలనటంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. ఢిల్లీ-ముంబై కారిడార్‌కో న్యాయం..విశాఖ- చెన్నై కారిడార్‌కు మరో న్యాయం, థొలేరా నగరానికి పుష్కలంగా నిధులిచ్చి అమరావతికి అన్యా యం చేయటం యూ టర్న్ అవునో కాదో ప్రజలే నిర్ణయిస్తారని హెచ్చరించారు. టీడీపీ ధర్మపోరాటం చేసినప్పుడల్లా పోటీ దీక్షలకు ప్రతిపక్షాలను ప్రేరేపించటంతో బీజేపీ, వైసీపీ, జనసేన లాలూచీ రాజకీయాలు ప్రజలు అర్థం చేసుకున్నారని సరైన సమయంలో సరైన టర్న్ తీసుకుంటారని వ్యాఖ్యానించారు.