రాష్ట్రీయం

అన్ని స్థానాలకూ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 27: ప్రశ్నించే స్థాయి నుండి తమ పార్టీ పాలించే స్థాయికి ఎదుగుతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుండి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభలో పవన్ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. అనుభవం లేని కారణంగానే గత ఎన్నికల్లో పోటీచేయలేదని, ప్రస్తుతం దశాబ్దకాలం అనుభవం సముపార్జించినందున వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతున్నామన్నారు. ఈ నెలాఖరుతో రాష్ట్రంలో పంచాయతీ పాలకవర్గాల కాలపరిమితి పూర్తవుతున్నందున, తక్షణం ఎన్నికలు పెట్టాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికలు పెడితే జనసేన పోటీచేస్తుందని పేర్కొన్న ఆయన పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుండి రావలసిన నిధులు రావని, అందుకే ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నానన్నారు.కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంలో లేరన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతే, దాని ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారంటూ వ్యాఖ్యానించిన పవన్ ‘ఓటమి భయంతో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించకుండా ఆపగలరా’ అని ప్రశ్నించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో గ్రామాలు జన్మభూమి కమిటీల దోపిడీలో నలిగిపోయాయని, మంచినీరు, రహదార్లు వంటి సమస్యలెన్నో గ్రామాలను పీడిస్తున్నాయని, అందుకని తక్షణం పంచాయతీ ఎన్నికలు జరపాలని డిమాండ్‌చేశారు. తనను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని ఇటీవల మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారని, అంటే ప్రజా సమస్యలపై మాట్లాడితే తప్పుదోవలో వెళుతున్నట్టా అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మాట్లాడితే సొంత సొమ్ముతో చేసినట్టు మేం రోడ్లు వేయించాం అని మంత్రి లోకేష్ అంటుంటారని, ఆయనకు ఆయన తండ్రి మంత్రి పదవి ఇచ్చింది, పని చేయడానికేనని ఎద్దేవాచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విపక్షం పాత్ర ఎంతో విలువైనదని, అలాంటి విపక్ష
నేత అసెంబ్లీని వదిలి పారిపోతున్నారని
ప్రశ్నించినందుకు జగన్ తనపై వ్యక్తిగత ఆరోపణలకు దిగారన్నారు. అదే స్థానంలో తాను ఉండివుంటే ప్రభుత్వాన్ని ఒక ఊపు ఊపేసేవాడినన్నారు. గతంలో కాంగ్రెస్ నాయకుడు వీహెచ్ కూడా తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని, రాహుల్ గాంధీ ఒక్కటీ చేసుకోలేదని వ్యాఖ్యానించారని, పెళ్లి చేసుకోనంత మాత్రాన ఆయనేమైనా బ్రహ్మచారా అని పవన్ వ్యాఖ్యానించారు. తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసేవారందరి కంటే తాను చాలా బెటర్ వ్యక్తినన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, ఏదీ దాసే ప్రసక్తి లేదన్నారు.
ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రాజీనామా తర్వాత రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తంచేశారు. గత ఎన్నికల్లో 15 సీట్లు ఇచ్చిన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పట్టణానికి ఒకసారి ముఖ్యమంత్రి తన భార్యాబిడ్డలతో వచ్చి కూర్చుంటే ప్రజలు ఎంతటి దుర్భర పరిస్థితుల్లో బతుకున్నారో అర్థమవుతుందన్నారు. ఏడాదికి రూ.15వేల కోట్ల ఆక్వా ఎగుమతులకు కేంద్రమైన భీమవరం పట్టణంలో ఇంతవరకు డంపింగ్ యార్డు నెలకొల్పలేకపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. యనమదుర్రు డ్రెయిన్ గట్లు డంపింగ్ యార్డుగా మారి దుర్గంధం వెదజల్లుతున్నాయన్నారు. స్వచ్ఛ్భారత్ నినాదం చేసే ప్రధాని మోదీ పార్టీకి బీజేపీకి చెందిన స్థానిక ఎంపీ గోకరాజు గంగరాజు ఈ విషయంలో ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, విపక్ష నేత జగన్, స్థానిక ఎంపీ గంగరాజు దమ్ముంటే భీమవరంలో చర్చావేదిక పెడితే జనసేన తరపున తాను ఒక్కడినే పాల్గొని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిలదీస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 40 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూశారని, 20 ఏళ్ల టీడీపీ పాలన చూశారని, అంతా అవినీతి దుర్గంధం వెదజల్లుతోందన్నారు. 2019 ఎన్నికల్లో జనసేనకు అండగా నిలవాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఏమీ ఆశించకుండా ప్రజలకోసం పనిచేసే పార్టీ జనసేన అని, యువత ఆశయాలను ఆంకాక్షలను నిలబెట్టడానికి మాత్రమే అధికారాన్ని సాధించాలని జనసేన కోరుకుంటోందన్నారు. ఈసందర్భంగా పార్టీలో చేరిన పలువురికి కండువాలు కప్పి ఆహ్వానించారు.

గోదావరి జిల్లాలకు దిష్టి తగిలింది...

నిత్యం సిరులతో తూలతూగే గోదావరి జిల్లాలకు దిష్టి తగిలిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గోదావరి జిల్లా అంటే మీకేంటి అన్నపూర్ణ ఎక్కడైనా కాలవలుంటాయి, కాటన్ డెల్టామయం చేశారని అంతా చెబుతుంటారని, అలా ఈ రెండు జిల్లాలకు దిష్టి తగిలిందన్నారు. చూట్టూ గోదావరి నీరున్నా తాగడానికి చుక్క నీరు లేదని, గ్రామాలన్నీ ఉప్పుమయం అయిపోయాయన్నారు. గోదావరి జిల్లాలకు దిష్టి తీయాలన్నారు.