రాష్ట్రీయం

వృక్షజాతులకు పునరుజ్జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: అంతరించిపోతున్న వృక్ష జాతుల పునరుజ్జీవనానికి తాము సైతం అంటూ సింగరేణి అడుగులు వేస్తోంది. ఈమేరకు హరితహారంను ప్రోత్సహించడానికి కాంట్రాక్టు పద్ధతిలో మొక్కలు పెంపడానికి సింగరేణి శ్రీకారం చుట్టింది. మొక్కలు నాటే కార్యక్రం మొక్కుబడిలా కాకుండా వాటిని పెంచడానికి కార్యాచరణ ప్రణాళికతో ముందడుగు వేస్తోంది. సింగరేణి ఏరియాలో 10,932 హెక్టార్లలో దాదాపు మూడు కోట్ల రూపాయల వ్యయంతో పచ్చదనం కోసం భారీ ఎత్తున మొక్కలు పెంచుతోంది. మొక్కల సంరక్షణ బాధ్యత సింగరేణి సమీప గ్రామాల ప్రజలకు కాంట్రాక్టు పద్ధతిలో ఉపాధి కల్పించడం జరుగుతోంది. అటవీ ప్రాంతాల సమీపం లోని గ్రామీణ ప్రజలు వంటచెరకుతో పాటు ఇతరత్రా అవసరాలకు వృక్షాలను నరికివేయడంతో అంతరించపోతున్నాయి. ముఖ్యంగా ఉసిరి, నారెప, మారేడు, నేరేడు, తాని, నెమలినార, జువ్వి, రావి, తెల్లచిందుగ, మేడి, బూరుగ, ఎర్రచెందనం, టేకు వంటి చెట్లు కనుమరుగవుతున్నాయి. చెట్ల ఫలాలపై ఆధారపడి జీవించే క్రిమికీటకాలు, పక్షులు, జంతువులు అటవీ ప్రాంతాల నుంచి దూరమవుతున్నాయి. సింగరేణి ప్రాంతంలో 11 నర్సరీల్లో 20 జాతుల మొక్కల పెంపంకం జరుగుతోంది. 2015లో హరితహార కార్యక్రమంలో సింగరేణి 45 లక్షలు, 2016లో కోటి, 2017 కోటీ 10 లక్షలు మొక్కలు పెంచింది. సింగరేణి 1989 సంవత్సరం నుంచి ప్లాంటేషన్ కార్యక్రమం చెపడుతోంది. ముఖ్యంగా సింగరేణిలో ఓపెన్ కాస్టు గనులు, డంపుయార్డుల మీద, ఒబి పంపు ప్లాంటేషన్, విశాలమైన ఖాళీ ప్రదేశాల్లో, రోడ్ల వెంబడి, కాలనీలు, కార్యలయాలు, పార్కుల్లో మొక్కలు పెంచడం చేపడుతోంది. అటవీశాఖ అధికారులకు సైతం ఇక్కడ శిక్షణ కార్యక్రమాన్ని సింగరేణి
నిర్వహిస్తోంది. సింగరేణి ఏరియాలో ఉన్న 50 కాలనీల్లో పండ్ల మొక్కలు జామ, గినె్న, మామిడి, పనస, కొబ్బరి, బత్తాయి మొక్కలను ఉచితంగా కార్మిక కుటుంబాలకు సింగరేణి అందచేస్తోంది.
ఈ ఏడాది కోటి మొక్కలు: సీఎండి శ్రీ్ధర్
తెలంగాణ హరితహారంలో భాగంగా సింగరేణిలో కూడా భారీగా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతోందని సింగరేణి సీఎండి శ్రీ్ధర్ వెల్లడించారు. కనుమరుగు అవుతున్న వృక్షాలను పెంచడానికి సింగరేణి ప్రణాళికతో చేపట్టనున్నదని ఆయన తెలిపారు. సింగరేణిలో పని చేస్తున్న ఉన్నతాధికారు ఎప్పటికప్పడు వృక్షాలను సంరక్షించడానికి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారని చెప్పారు. అటవీశాఖలో రిటైర్డు ఐఎఫ్‌ఎస్ అధికారి సురేంద్రపాండే సారథ్యంలో ఏజీఎం వివేక్‌బాబుతో పాటు ఏరియా మేనేజర్లు పర్యవేక్షణ జరుగుతోందని వివరించారు. సింగరేణి ఏరియాలో ఉన్న గనుల్లో ఉద్యోగ, కార్మికులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నారని సంస్థ పౌరసంబంధాల అధికారి మహేష్ ప్రకటించారు.