రాష్ట్రీయం

సికింద్రాబాద్-గౌహతి మధ్య ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షణ మధ్య రైల్వే సికింద్రాబాద్-కమాక్య (గౌమతి)ల మధ్య 52 ప్రత్యేక రైళ్లను నడపనుంది. 07149/07150 నెంబర్లు గల ట్రైన్లు ఆగస్టు 3 నుంచి వచ్చే ఏడాది జనవరి 28 వరకు ఈ రెండు స్టేషన్ల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. సికింద్రాబాద్ నుంచి ఉదయం 7:30 గంటలకు బయలు దేరి ఆదివారం ఉదయం 8:20కి కమాక్య (గౌహతి)కి చేరుకుంటోంది. తిరుగు ప్రయాణంలో కమాక్య నుంచి ఉదయం 5:42 నిమిషాలకు బలయలుదేరి బుధవారం ఉదయం 9:15 నిమిషాలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటోంది. ఈ ప్రత్యేక రైళ్లకు నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఎలూరు, రాజమండ్రి, సామల్‌కోట్, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, బెర్హంపూర్, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలసూర్, ఖరగ్‌పూర్, బద్రామన్, రామ్‌పురహత్, మల్డా టౌన్, కిషన్‌గంజ్, న్యూ జల్‌పాయ్‌గురి, జల్‌పాయ్‌గిరి రోడ్ తదితర స్టేషన్లలో నిలుస్తోంది.