రాష్ట్రీయం

మూగవైతే ఏమిలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రటి నేల... పచ్చటి చెరకు పంట... ఇప్పటిదాకా చేను గట్టుపైనుండే చూసిన ఆ చిన్నారి కాడెద్దుల మధ్యకు చేరింది. ఇంటి దూలానికో, చెట్టుకొమ్మకో వేలాడాల్సిన ఊయల కాడిమానుకు చేరడంతో ఆ చిన్నారి ఏం జరుగుతోందోనని, ఎటు పోతోందోనని వింతగా, బేలగా చూస్తోంది కదూ. భూమి తల్లినే నమ్ముకున్న ఆ తల్లిదండ్రులు చిన్నారిని గట్టుమీద వదల్లేక ఇలా ఊయల కట్టి పొలంలో దించారు. తల్లి కలుపు తీయడం, తండ్రి నాగలి పట్టడం ఆ చిన్నారిని అనివార్యంగా కాడిమానుకు చేర్చారు. సన్నకారు రైతుల కష్టానికి ఈ చిత్రమే నిలువెత్తు నిదర్శనం. కర్నూలు జిల్లా మిడుతూరు మండలం నాగటూరులో శనివారం కెమెరాకు చిక్కిన దృశ్యమిది.