రాష్ట్రీయం

విజయం మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 28: రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం భారీ విజయాన్ని సాధిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకోగలుగుతుందన్నారు. ఒంగోలులోని మిని స్టేడియంలో శనివారం జరిగిన ధర్మపోరాటం బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు కనువిప్పు కలిగే రీతిలో 25 పార్లమెంటు స్ధానాలను కైవసం చేసుకుంటే ప్రధానిమంత్రి అభ్యర్థ్ధి ఎంపికలో తమ పార్టీ నిర్ణయాత్మకంగా మారుతుందన్నారు. ముఖ్యమంత్రి పదవి నుండి ఎన్‌టీఆర్‌ను గద్దెదించితే 30రోజుల్లో తెలుగుజాతి సత్తా ఏమిటో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి చూపించి ఆ పదవిని మళ్ళీ చేపట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రెండుసార్లు ప్రధానమంత్రులను పార్లమెంటుకు పంపిన ఘనత కూడా తమ పార్టీకే దక్కిందన్నారు. కేంద్రం మెడలు వంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని అన్ని అంశాలను సాధించుకుంటామని బాబు చెప్పారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై దేశంలోని అన్నిప్రాంతీయ, జాతీయ పార్టీలను కూడగట్టి పార్లమెంటులో కేంద్రప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని ఎండగట్టామన్నారు. కేవలం ఓట్లకోసమే వెంకన్న సాక్షిగా మోదీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని, ఆ తరువాత 14వ ఆర్థిక సంఘాన్ని అడ్డం పెట్టుకుని మోసం చేశారన్నారు. దేశ చరిత్రలో ఓ జాతీయపార్టీపై ప్రాంతీయపార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. అవిశ్వాసానికి తాము అడక్కపోయినా కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చిందన్నారు. విభజన హామీల విషయంలో తాను యూటర్న్ తీసుకోలేదని, ఈ విషయంలో మోదీ అసత్యాలు మాట్లాడుతున్నారని బాబు విమర్శించారు. తమ డిమాండ్ల విషయంలో కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తున్నామని, ఎంపీలు పార్లమెంట్‌లో నిర్వహించిన భూమిక అమోఘమని చంద్రబాబు ప్రశంసించారు. తెలుగుజాతికి జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తానికి వివరించామన్నారు. దేశం మొత్తంమీద ఉన్న తెలుగుజాతి రానున్న ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మద్దతు కూడకడతానని చెప్పిన పవన్ ప్రస్తుతం ప్రభుత్వానికే అడ్డుపడుతున్నారని విమర్శించారు. కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్న వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పరోక్షంగా నిప్పులు చెరిగారు. ఎంపి పదవులకు రాజీనామాలు చేయడమంటే పారిపోవటమేనని, కాని తమ పార్టీకి చెందిన సభ్యులు రాజీనామాలు చేయకుండా ప్రత్యేక హోదాపై ఆందోళనలు చేస్తున్నారని ఆయన తెలిపారు. తాను అధికారంలోకి వస్తే అవినీతిపరుల భరతం పడతానని చెప్పిన మోదీ అవినీతిలో కూరుకుపోయిన జగన్ ఆస్తులను జప్తు చేయలేదని, ఇది లాలూచి రాజకీయం కాదా ఆయన ప్రశ్నించారు. అన్ని రాజకీయపార్టీ అంగీకరించినా ఎందుకు ప్రత్యేకహోదా ఇవ్వరని ఆయన మోదీని నిలదీశారు.తాము గొంతెమ్మకోర్కెలు కోరటం లేదని, ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య అన్నారు. తమను బెదిరించాలని చూస్తే తగిన గుణపాఠం చెబుతామన్నారు. 2019 మేనాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని, విశాఖపట్నం రైల్వేజోన్‌ను ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్
చేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఈసంవత్సరమే శంకుస్ధాపన చేస్తున్నట్టు ప్రకటించారు.అదే విధంగా వెలుగొండ ప్రాజెక్టుకు తానే పునాది వేశానని, వచ్చే సంక్రాంతి నాటికి మొదటి టనె్నల్‌ను పూర్తిచేసి నెల్లూరు,ప్రకాశం జిల్లాల ప్రజలకు తాగు,సాగునీరు అందిస్తామని వెల్లడించారు.
కాగా చిత్తూరు మదనపల్లె ప్రాంతానికి సుధాకర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆత్మహత్య చేసుకోవటం బాధకరమని, ఆయన కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ తరుపున ఐదులక్షలు,ప్రభుత్వం తరుపున మరో ఐదులక్షల రూపాయలను ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. సుధాకర్ కుటుంబానికి తన ప్రగాఢసానుభూతిని తెలిపారు. వరంగల్‌కు చెందిన మరో వ్యక్తి ఢిల్లీలో టవర్ ఎక్కి ప్రత్యేక హోదాకోసం నిరసన తెలపటం అభినందనీయమన్నారు.ఎవరు అధైర్యపడవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేసిన చంద్రబాబు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను సాధించుకోగలమన్న ధీమా వ్యక్తం చేశారు.

చిత్రం..ధర్మపోరాట సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు