రాష్ట్రీయం

టెక్నాలజీతో ముందుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. పార్టీ బలోపేతానికి సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలని నేతలకు ఆయన సూచించారు. శనివారం గాంధీభవన్‌లో శక్తి యాప్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు ఏడు కోట్ల మంది నూతన ఓటర్లుగా నమోదు అవుతున్నారని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధంగా వినియోగించుకోవడంలో ప్రత్యర్థి వర్గం ముందంజలో ఉండగా మనం వెనుకబడి ఉండడం సరికాదని అన్నారు. నూతనంగా ఓటర్లుగా నమోదు అవుతున్న వారికి సాంకేతికతతోనే చేరువ కాగలమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో దాదాపు 2.2 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వారిలో కనీ సం పది శాతం మంది అంటే సుమారు 22 లక్షల మందిని శక్తిఆప్‌లో సభ్యులుగా చేర్చించాలని ఆయన సూచించారు. ప్రతి పోలింగ్ బూత్‌లో 25మందిని శక్తి ఆప్‌లో సభ్యులుగా చేర్చితే వారి ద్వారా నియోజకవర్గంలోని ప్రజలకు పార్టీ విధానాలను వివరించే అవకాశం ఏర్పడుతుందన్నారు. తెలంగాణలో వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నందున అందుకు సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు. ఇందుకోసం ప్ర తి నెల లక్ష నుంచి 2లక్షల మంది సభ్యులుగా చేర్చాలని లక్ష్యాన్ని నిర్ధేశించారు. దేశవ్యాప్తంగా ఎన్నో ఒత్తిళ్లు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు.
శక్తి యాప్ చాలా కీలకం: ఉత్తమ్
కాంగ్రెస్ పార్టీ గెలుపునకు శక్తి యాప్ చాలా కీలకమని, రాహుల్ గాంధీ చాలా ఆసక్తిగా ఈ ప్రాజెక్టును చేపట్టారని, నాయకులు, కా ర్యకర్తలు శ్రద్ధతో పని చేయాలని సూచించా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, పా ర్టీ ప్రచార కార్యక్రమాలు ప్రజల చెంతకు చేర్చేందుకు ఆప్ ఎంతగానో ఉపయోగపడనుందన్నారు. ఇప్పటికే ఆప్‌లో లక్ష మంది నమోదు చేసుకున్నారని, పార్టీ అధిష్టానం సూచించిన విధంగా ప్రతి నెల రెండు లక్షల మందిని ఇందులో నమోదు చేస్తామని పేర్కొన్నారు. టీ.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐసీసీ ఇ న్‌చార్జి ప్రవీణ్ చక్రవర్తి, సీఎల్‌పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలోప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ హనుమంత రావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, శక్తి ఆప్ తెలంగాణ ఇన్‌చార్జి రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి మ ర్రి శశిధర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పార్టీ రాష్ట్ర కోశాధికారి గూడురు నారాయణ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.

చిత్రం..గాంధీ భవన్‌లో జరిగిన శక్తి ప్రాజెక్టు సమావేశంలో పాల్గొన్న చిదంబరం