రాష్ట్రీయం

శ్రీశైలం టు సాగర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, జూలై 28: నాగార్జునసాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి నీటి రాక ప్రారంభమైంది. కృష్ణానది యాజమాన్య బోర్డు ఉత్తర్వుల మేరకు శ్రీశైలం డ్యాం నుండి నాగార్జునసాగర్ డ్యాంకు రోజుకు 2 టీఎంసీల నీరు శనివారం నుండి విడుదల చేయాలని ఆదేశించడంతో శ్రీశైలంలో విద్యుతుత్పత్తి కేంద్రం ద్వారా నీటి విడుదల జరగుతోంది. సాగర్‌కు సగటున శనివారం ఉదయం 6 గంటలకు 6,470 క్యూసెక్కుల రాక ఉండగా 7 గంటలకు 23,765 క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుతం శనివారం సాయంత్రం 6 గంటల వరకు 19,070 క్యూసెక్కుల నీటిని విద్యుత్పత్తి ద్వారా సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయం 590 అడుగులకు గాను 511.70 అడుగులకు పెరిగింది. కాగా శ్రీశైలానికి ఎగువ నుండి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. జూరాల ప్రాజెక్టు నుండి 42,020 క్యూసెక్కులు, సుంకేశుల నుండి 41,360 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా శనివారం శ్రీశైలంలో 872.70 అడుగులకు నీటి మట్టం ఉంది. దీంతో తెలంగాణకు 30 టీఎంసీలు, ఏపీకి 25 టీఎంసీలు కేటాయించిన నేపధ్యంలో శ్రీశైలం నుండి సాగర్‌కు నీటి విడుదల ప్రారంభమైంది. ఎడమ కాల్వ ద్వారా 12 టీఎంసీల నీటిని విడుదల చేయాలని బోర్డు నిర్ణయించడంతో ఎడమ కాల్వ పరిధిలో రైతాంగం కాల్వలకు నీరు ఎప్పుడు విడుదల చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయతే శ్రీశైలం నిండి భారీగా ఇన్‌ఫ్లో వస్తుందని ఆశపడ్డ రైతులు శ్రీశైలానికి ఇన్‌ఫ్లో తగ్గడంతో నిరాశచెందారు.