రాష్ట్రీయం

8న దళిత గిరిజన సింహగర్జన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ దేశ రాజధానిలో ఆగస్టు 8న దళిత గిరిజన సింహగర్జన మహాసభను నిర్వస్తామని ఎమ్మార్పీస్ వ్యవస్థపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. కృష్ణమాదిగ ఆదివారం విలేఖరుతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా లక్షలాది మందితో రామ్‌లీలా మైదాన్‌లో సింహగర్జన నిర్వహిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలను అణగదొక్కాలని చూస్తోన్న కేంద్ర ప్రభుత్వానికి ఈ సింహాగర్జన ద్వారా ఒక హెచ్చరికను జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరుగుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో దళిత, గిరిజన ఓట్లతో కేంద్రానికి బుద్ధిచెబుతామని మంద కృష్ణ హెచ్చరించారు. సింహగర్జన కోసం జాతీయస్థాయిలో దళిత నేతలను సంప్రదిస్తున్నట్టు ఆయన చెప్పారు. సింహగర్జనకు దళితులు, గిరిజనులు పెద్దఎత్తున హజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు, కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికోట్టేందుకు- దళిత, గిరిజన సమాజం దేశంలో గౌరవంగా జీవించేందుకు ఈ సభకు హాజరుకావాలని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్రలున్నాయని ఆయన మండిపడ్డారు. తీర్పు ఇచ్చిన తరువాత దళిత సంఘాల ఆందోళనల అనంతరం సుప్రీం కోర్టును కేంద్రం ఆశ్రయించిందని, అప్పటివరకు కేంద్రం సుప్రీం కోర్టు తలుపుతట్టలేదని మంద కృష్ణ గుర్తుచేశారు. ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు దళితులను మభ్యపెట్టే ప్రయత్నం కేంద్రం చేస్తోందని మంద కృష్ణ ధ్వజమెత్తారు.