రాష్ట్రీయం

సినారె పేరిట జాతీయ సాహిత్య పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: ప్రముఖ తెలుగు కవి డాక్టర్ సి. నారాయణరెడ్డి పేరుతో జాతీయ సాహిత్య అవార్డు ఇవ్వాలని సినారే కుటుంబ సభ్యులు నిర్ణయించారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న భారతీయ భాషలకు సంబంధించిన ప్రముఖ కవి ఒకరిని ఏటా ఎంపిక చేసి అవార్డు అందచేస్తారు. అవార్డు కింద మూడులక్షల నగదు పారితోషికం, మొమెంటో, శాలువా బహూకరిస్తారు. నిపుణుల కమిటీ సమావేశమై అవార్డు కోసం ఒకరిని ఎంపిక చేస్తారని సినారే కుటుంబ సభ్యుల తరఫున డాక్టర్ జె. చెన్నయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సినారే జయంతి రోజు ఈ అవార్డును ఇస్తారని, తొలి పర్యాయం అవార్డును 2019 జూలై 29 న ఇస్తారని ఆయన వివరించారు. డాక్టర్ సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య అవార్డును ఏటా ఇవ్వాలని సినారే భార్య సి. గంగ, పెద్దకూతురు నిర్ణయించారని చెన్నయ్య వివరించారు.