రాష్ట్రీయం

అమ్మకు బోనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: సికిందరాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌సహా పలువురు ప్రముఖులు ఆదివారం బోనం సమర్పించుకున్నారు. పార్లమెంటు సభ్యురాలు కవిత బంగారు బోనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జనసేన నేత పవన్ కళ్యాణ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా లష్కర్ బోనాలకు భక్తులు పోటెత్తారు. కేసీఆర్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అనంతరం అమ్మవారికి ముక్కుపుడక, బొట్టు, ఖడ్గం తలసాని బహూకరించి మొక్కుతీర్చుకున్నారు. ఉదయం 11 గంటలకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో బంగారు బోనం ఊరేగింపు కొనసాగింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని బంగారు బోనం కార్యక్రమం ప్రారంభించారు. నిజామాబాద్ ఎంపీ కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ఆదయ్యనగర్ నుంచి మహంకాళి దేవాలయం వరకు బంగారు బోనాన్ని ఊరేగింపుగా తెచ్చారు. డప్పు వాయిద్యాలు, కళాకారుల కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో బోనం ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ సతీమణి శైలిమ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కేసీఆర్ కొద్దినిమిషాలు అమ్మవారిని
దర్శించుకొని తిరిగి వెళ్ళిపోయారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొన్న వారిలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండల చైర్మన్ స్వామిగౌడ్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లా రెడ్డి, ఎమ్మెల్యేలు సాయన్న, కిషన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
ఉత్తమ్‌కు కేసీఆర్ పలకరింత
కేసీఆర్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ఇద్దరు ఒకేసారి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఉత్తమ్‌కు కేసీఆర్ మర్యాదపూర్వకంగా పలకరించారు. కేసీఆర్ రాక సందర్భంగా, జనసేన నేత పవన్‌కళ్యాణ్ వచ్చిన సమయంలో భక్తులు కొద్దిసేపు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, ఆదివారం సాయంత్రం అమ్మవారి ఆలయం పరిసరాలు ఫలహార బండ్లు, పోతురాజుల నాట్యాలతో కోలాహలంగా మారాయి.

చిత్రాలు..బంగారు బోనంతో ఎంపీకవిత

*సికింద్రాబాద్ ఉజ్జయని మహాంకాళికి బోనాలు సమర్పిస్తున్న సీఎం కేసీఆర్ దంపతులు, మంత్రులు