రాష్ట్రీయం

అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు వెళ్లినా, వెళ్లకపోయినా వచ్చే ఎన్నికల వ్యూహంపై టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై ఇప్పటికే మూడు దఫాలుగా సర్వే నివేదికలు తెప్పించుకున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వచ్చే ఎన్నికలకు సిట్టింగ్‌లను సమాయత్తం చేస్తూనే ఉన్నారు. విజయవకాశాలు సులువుగా ఉన్న సిట్టింగ్‌లను అదే ఒరవడిని కొనసాగించాల్సిందిగా సూచిస్తూనే, పనితీరు సం తృప్తిగా లేనట్టు సర్వేలో తేలిన సిట్టింగ్‌లను అప్రమత్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలకు చెందిన సిట్టింగ్‌లున్న నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ఎవరిని నిలబెడితే విజయం
సాధించగలరు? అనే కోణంలో కూడా టీఆర్‌ఎస్ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జీలుగా కొనసాగుతోన్న వారికి టికెట్ ఇస్తే బరిలో నెగ్గుకురాగలుగుతారా? లేక ప్రతిపక్ష సిట్టింగ్‌లను ఎన్నికలకు ముందు పార్టీలోకి లాక్కొని టికెట్ ఇవ్వాలా? అలా వచ్చే వారిలో ఎవరున్నారు? వారిని దారిలోకి తెచ్చుకోవడానికి ఉన్న మార్గాలపై కూడా టీఆర్‌ఎస్ దృష్టి సారించింది. కొన్నిచోట్ల సిట్టింగ్‌లను మారిస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో కూడా కసరత్తు జరుగుతోన్నట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న ఎంపీల స్థానంలో బరిలో దింపడానికి కొందరు ఎమ్మెల్యేల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వారిని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న వారిని ఎంపీలుగా కొందరి పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. అలాగే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరుల పేర్లను ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దింపితే ఎలా ఉంటుందని అధిష్ఠానం యోచిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందన్న సర్వే నివేదికల అంచనాలను దృష్టిలో ఉంచుకొని, ఎమ్మెల్యేలుగా పోటీ చేసి మంత్రి పదవి పొందాలన్న ఆశిస్తున్న వారిలో కనీసం ముగ్గురు, నలుగురు ఎంపీలున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే ఇప్పటికే మూడు, నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేలుగా గెలుపొంది వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్న వారు కూడా పది మందిదాకా ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.