రాష్ట్రీయం

కాబోయే సీఎం ఉత్తమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సర్వే సత్యనారాయణ జోస్యం చెప్పారు. అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ ఒక్కటయ్యే అవకాశం ఉందని చెప్పారు. బోడుప్పల్‌లో కాంగ్రెస్ సభలో
పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తమతో కలిసి వచ్చేలా ఉన్నారని, రెండు పార్టీల కలయికతో వంద సీట్లకు పైగా కైవసం చేసుకుంటామని పేర్కొన్నారు. పార్టీ పటిష్ఠత కోసం ఎంతో శ్రమిస్తూ, అందరినీ కలుపుకుపోతూ, పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తున్న ఉత్తమ్‌కు పార్టీ హైకమాండ్ ప్రశంసలు ఉన్నాయని, ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని రాహుల్ నాయకత్వంలో కేంద్ర కేబినెట్‌లో తాను మంత్రినై మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం ప్రజలకు సేవలందిస్తానని తన కోరికను బయట పెట్టారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆదివారం జరిగిన సికింబ్రాద్ ఉజ్జయిని మహంకాళీ అమ్మ జాతరలో తల్లిని కోరుకున్నానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉత్తమ్, కేంద్ర మంత్రి హోదాలో తాను రాబోయే బోనాల జాతరలో హాజరవుతామని మొక్కుకున్నట్లు వివరించారు. దళితుడిని సీఎం చేస్తామంటే కోటి మంది దళితులు టీఆర్‌ఎస్‌ను గెలిపించారని, అయితే మోసం చేసి కేసీఆర్ సీఎం అయ్యాడని విమర్శించారు. మంత్రి పదవులను కుటుంబ సభ్యులకే ఇచ్చారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ నాయకుడు తోటకూర వజ్రేశ్ యాదవ్ (జంగయ్య) మాట్లాడుతూ అవినీతి మేడ్చల్ ఎమ్మెల్యే పని తీరుపై ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు కేసీఆర్ ఇక్కడ జరిగిన బహిరంగ సభలో పేదలకు ఐదువేల ఇండ్లను మంజూరు చేస్తానని ఇచ్చిన హామీలు నీటి బుడగలుగా మారాయన్నారు. నాలుగేళ్లలో ఇప్పటి వరకు బోడుప్పల్‌లో ఎమ్మెల్యే కోటా నిధులు ఇవ్వలేదని విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఇప్పుడు ఎంత సంపాదించారో దమ్ముంటే సుధీర్ రెడ్డి బయట పెట్టాలని సవాల్ చేశారు. కమీషన్ కోసం ఇద్దరు కమిషనర్లను పెట్టుకుని ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని, అవినీతి అక్రమాలపై అధికార పార్టీ జడ్పీటీసీ తన పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేపై తిరుగుబాటు చేయడం శోచనీయమన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం మేడ్చల్ నుంచి టికెట్ ఎవరికి ఇచ్చినా శ్రమించి గెలిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్, బోడుప్పల్ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగుల నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పీసీసీ అధ్యక్షుడు ఉత్జమ్‌ను సన్మానించేందుకు నేతలు పోటీ పడ్డారు. ప్రముఖ కళాకారులు ఏపూరి సోమన్న సారధ్యంలో కళాకారుల బృంధం నిర్వహించిన ఆట, పాట ధూంధాం అందర్ని ఆకట్టుకుంది. వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు స్టెప్పులు వేసి ఉత్సాహ పరిచారు.