రాష్ట్రీయం

ఇదే అదును.. ప్రచారానికి పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలన్నీ 2019 ఎన్నికల్లో లబ్ధిపొందాలన్న దృష్టితో ముఖ్యమంత్రి, తెరాస అధినేత కే. చంద్రశేఖరరావు ఒక ప్రణాళిక రూపొందించారని రాజకీయ, ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కేసీఆర్ పక్కాగా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తున్నారని భావిస్తున్నారు.
2018 జూలైలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడ్డప్పటికీ, ఈ అవకాశాన్ని కూడా కేసీఆర్ పకడ్బందీ వ్యూహంతో సద్వినియోగం చేసుకుంటున్నారని తెలుస్తోంది. 2018 జూలై 31తో ప్రస్తుతం అధికారంలో ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, వార్డుమెంబర్ల పదవీ కాలం ముగుస్తోంది. ఆగస్టు ఒకటి నుండి సర్పంచ్‌ల స్థానంలో ప్రత్యేక అధికారులు పగ్గాలు చేపట్టేందుకు ఉద్యుక్తులవుతున్నారు. అలాగే కొత్తగా 57 మున్సిపాలిటీలు 2018 ఆగస్టు ఒకటిన ఏర్పాటుకాబోతున్నాయి. మున్సిపల్ చైర్మన్ల స్థానంలో వీటికి కూడా ప్రభుత్వ అధికారులే ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారు. అంటేప్రభుత్వ యంత్రాంగమే పంచాయతీల్లో, దాదాపు 50 శాతం మున్సిపాలిటీల్లో (మొత్తం మున్సిపాలిటీల సంఖ్య 125) అధికారంలో ఉంటుందని స్పష్టమవుతుంది. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (జీహెచ్‌ఎంసీ) తో సహా వివిధ కార్పోరేషన్లు, మెజారిటీ మున్సిపాలిటీల్లో తెరాస పాలకమండళ్లలో కొనసాగుతోంది. ఈ కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాలతో పాటు, పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ పథకాల గురించి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రచారం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌కు వీలుకలుగుతోంది.
నాడు సెంటిమెంట్.. నేడు అభివృద్ధి..
2014 ఎన్నికల్లో ‘తెలంగాణ సెంటిమెంట్’ టీఆర్‌ఎస్‌కు బాగా ఉపయోగపడింది. తెలంగాణ ఏర్పాటుకు కే. చంద్రశేఖరరావు చేసిన కృషి ప్రధానమైన కారణమని విశ్వసించిన ప్రజలు టీఆర్‌ఎస్‌కు శాసనసభలో సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు. అయితే, అప్పటి మాదిరి 2019 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ఉండబోదని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ తాను చేపట్టిన పథకాలు, కార్యక్రమాల గురించి ప్రచారం చేసుకునేందుకు సిద్ధమవుతుండగా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాలు సమాయత్తమవుతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో కేసీఆర్ చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు, సంక్షే మ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయనడంలో సందే హం లేదు. రైతుబంధు పథకం కింద ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు (వానాకాలం, యాసం గి కలిపి) ఇస్తుండటంతో దాదాపు 58 లక్షల మంది రైతులకు సుమారు 12 వేల కోట్ల
రూపాయలు అందుతున్నాయి. ఇప్పటికే 5 వేలకోట్ల రూపాయల పంపిణీ జరిగింది. మరో ఆరువేల కోట్ల రూపాయలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇలా ఉండగా దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, పేదలకోసం సంక్షేమ పింఛన్ ఇస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పేదలకు పౌష్టికాహారం సరఫరా, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల హెచ్చింపు తదితర సంక్షేమ పథకాలు మరో 40 లక్షల కుటుంబాలకు అందుతున్నాయి. వీటి గురించి ప్రచారం చేయాలని తెరాస అధినేత భావిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిరంతరం విద్యుత్తు ఇవ్వగలుగుతున్నారు. ఇది తెరాసకు పెద్ద ప్లస్‌పాయింట్, వ్యవసాయ బావులకు ఉచిత విద్యుత్తు ప్రభావం బాగా కనిపిస్తోంది.
సాగునీరు
కోటి ఎకరాలకు సాగునీటిని ఇచ్చేందుకు వీలుగా చేపట్టిన వివిధ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికావస్తోంది. అన్ని గ్రామాలకు, అన్నిపట్టణాలకు తాగునీటిని ఇచ్చేందుకు చేపట్టిన ‘మిషన్ భగీరథ’ పనులు కూడా పూర్తికావచ్చాయి. మిషన్ కాకతీయ కింద దాదాపు అన్ని గ్రామాల్లోని చెరువులు, కుంటల మరమ్మతులు చేశారు. 96 శాతం గ్రామాలకు రోడ్లు వేయడం, ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడం పూర్తయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బ్రాహ్మణ కార్పోరేషన్ల ద్వారా యువతకు స్వయం ఉపాధికి అవసరమైన నిధులను కేటాయించారు. వీటన్నింటికీ ప్రచారం కల్పించేందుకు తెరాస బహుముఖ వ్యూహం రూపొందించుకుని, ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముందుకు వెళుతోందని అంతా భావిస్తున్నారు.