రాష్ట్రీయం

తిరుమలలో వైభవంగా చాతుర్మాస దీక్ష సంకల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 29: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పెద్దజీయ్యంగార్ నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పెద్దజీయ్యంగార్ మాట్లాడుతూ ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని తెలిపారు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారని తెలిపారు. అంతకుముందు పెద్దజీయంగార్ తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం పక్కనే ఉన్న జీయంగారి మఠం వద్ద నుంచి చిన్నజీయంగార్ ఇతర శిష్యబృందంతో బయలుదేరి, తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహస్వామి వారి ఆలయాన్ని, స్వామి పుష్కరిణిని సందర్శించారు. అక్కడ నుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. స్వామివారి దర్శనానంతరం పెదజీయంగారికి మేల్‌చాట్ వస్త్రాన్ని, చిన్న జీయర్‌కు నూలుచాట్ వస్త్రాన్ని బహూకరించారు.