రాష్ట్రీయం

తూ.గో.లో కొనసాగిన జగన్ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గంపేట, జూలై 29: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం కొనసాగింది. నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట నుండి ఆదివారం ఉదయం ప్రారంభమైన యాత్ర సాయంత్రం కిర్లంపూడి మండలం వీరవరంలో ముగిసింది.
పాదయాత్ర ప్రారంభానికి ముందు ఉపాధి హామీ పథకం క్షేత్రస్ధాయి సహాయకులు జగన్‌ను కలిసి ఎన్నో ఏళ్లుగా పనిచేస్నున్నప్పటికీ తమకు ఉద్యోగ భద్రత లేదని, వేతనాలు కూడా సక్రమంగా చెల్లించడంలేదని విన్నవించుకున్నారు. జగన్ పాదయాత్ర 16వ నెంబరు జాతీయ రహదారి మీదుగా సుమారు నాలుగు కిలోమీటర్లు కొనసాగింది.
అక్కడ నుంచి రామవరం గ్రామం మీదుగా సాగింది. ఈ పాదయాత్రలో మహిళలు పెద్ద ఎత్తున జగన్‌ను చూసేందుకు వచ్చారు. పలువు సంఘాల వారు జగన్‌ను కలిసి, వారి సమస్యలపై వినతిపత్రాలు అందించారు. పంచాయతీ మినిస్టీరియల్ సిబ్బంది, పామాయిల్ రైతులు జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. అక్కడి నుండి కిర్లంపూడి మండలం రామచంద్రాపురం రోడ్డులో పాదయాత్ర నిర్వహించిన జగన్ గోనేడ సమీపంలో బెల్లం తయారీ పరిశ్రమల వారి వద్దకు వెళ్ళి అక్కడ బెల్లం తయారీ విధానాన్ని పరిశీలించారు. వారి కష్టాలు తెలుసుకున్నారు. మధ్యాహ్నం గోనేడ గ్రామంలో భోజన విరామం తీసుకున్నారు.
తిరిగి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన యాత్ర రామచంద్రాపురం మీదుగా వీరవరం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ కో-ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు, వైసీపీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఒమ్మి రఘురామ్ తదితరులు పాల్గోన్నారు.
ప్ల కార్డులతో కాపుల నిరసన
కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన వ్యాఖ్యలపై గోనేడ గ్రామంలో కాపు యువత, మహిళలను నిరసన వ్యక్తంచేశారు. జగన్ పాదయాత్ర తమ గ్రామంలో సాగుతున్నపుడు గోనేడ రచ్చబండ యూత్ సభ్యులు, కాపు యూత్ సభ్యులు, మహిళలు కాపులను బీసీల్లో చేర్చాలంటూ ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ‘జగన్ సార్ కాపులను మోసగించ వద్దు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కాపుల రిజర్వేషన్లు కేంద్రం మెడలు వంచి సాధించాలి’ అనే ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.

చిత్రం..కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన వ్యాఖ్యలపై గోనేడ
గ్రామంలో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న కాపులు