రాష్ట్రీయం

మంత్రి జూపల్లి రాజీనామా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించడంలో విఫలమైనందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు శిక్ష విధించినా గుణపాఠం నేర్చుకోకుండా, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే అవినీతి ఆరోపణలు చేస్తున్నదని ఆయన విమర్శించారు. యుద్ధ విమానల కొనుగోలులో అవినీతి జరిగిందని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఆయన తెలిపారు. బీసీల జనాభా 52 శాతం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 34 శాతంగా చూపించిందని దత్తాత్రేయ విమర్శించారు.