రాష్ట్రీయం

ఆగస్టు నుంచి రెరా అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: ఇక నుంచి రియలెస్టేట్ వ్యాపారాలు, వాటికి సంబంధించిన ఏజెంట్లు తప్పనిసరిగా రేరా (రియలెస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ)లో రిజిష్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన నియమనిబంధనలు ఆగస్టు నుంచి అమలులోకి రానున్నాయి. అపార్ట్‌మెంట్లు, స్థలాలు క్రయవిక్రయాల్లో మోసపోకుండా ఉండడానికి రేరాను ఆశ్రయించవచ్చును. తెలంగాణ రేరాకు చైర్మన్‌గా సీనియర్ ఐఎఎస్ అధికారి రాజేశ్వర్ తివారీని ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్‌తో పాటు పట్టణాల్లో ఆస్థులు కొనుగోలు, అమ్మకాలు చేయాలని యోచించే ఔత్సాహికులు రేరాలో తమ పేర్లను రిజిష్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. రియలెస్టేట్‌లో మోసాలతో డబ్బులు నష్టపోయినవారు కొందరు అయితే మరి కొందరు ఏకంగా హత్యలుకు గురైన వారు ఉన్నారు. ఇలాంటి పేచేలు లేకండా ఉండడానికి యజమానుల ఆస్థులకు రేరా పరిరక్షణగా ఉంటుందని రియల్ట్ విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. రేరాలో అమ్మకదార్లతో పాటు కొనుగోలుదారులు ఉమ్మడి అకౌంట్ (ఎస్‌రో)లో డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. ఇక నుంచి బిల్డర్ ఎస్‌రోలో 75 శాతం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అమ్మక, కొనుగోలు వ్యక్తుల మధ్య ఒప్పందం మేరకు అపార్ట్‌మెంట్ నిర్మాణం నుంచి బదిలీ వరకు రేరా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అపార్ట్‌మెంట్ బదిలీల్లో జాప్యం చేస్తే అందుకు బిల్డర్‌పై రేరాలో ఫిర్యాదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేల బిల్డర్‌ది తప్పని తెలిస్తే అందుకు అపరాధరుసుం చెల్లించాలని రేరా ఆదేశిస్తుంది. అపార్ట్‌మెంట్ నిర్మాణ దశలో ఉన్నప్పుడు ప్రకృతివైపరిత్యాలతో ఎలాంటి నష్టాలు జరగకుండా ఉండడానకి అందుకు బీమా సౌకర్యం ఉంటుంది. న్యాయ, ఆర్థిక పరంగా తమ ఆస్థులను పరిరక్షించుకోవడానికి రేరా అండగా ఉంటుంది. ఒకరిపై ఒకరు అజమాయిసీ లేకుండా ఉండడానికి రేరా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. రియలెస్టేట్ వ్యక్తుల నుంచి అపార్ట్‌మెంట్ కొన్న యజమానుల మధ్య లావాదేవీలపై గొడవలు రావడం పోలీసులు, కోర్టులను ఆశ్రయించడం జరుగుతోంది. వాటి పరిష్కారం కోసం కోర్టుల చుట్టూ తిరిగుతూ సంవత్సరాలు పట్టడం జరుగుతోంది. ఆస్థుల క్రయవిక్రయాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా రేరాను తీసుకువచ్చాయి.