రాష్ట్రీయం

ప్రతి యూనివర్శిటీ ఐథు గ్రామాల దత్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా రంగంలో సంస్కరణలను శ్రీకారం చుట్టిన కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ విశ్వవిద్యాలయాలు కేవలం పరీక్షలు- సర్ట్ఫికేట్ల జారీకే పరిమితం కాకుండా లోకజ్ఞానాన్ని పెంచేవిగానూ, సామాజిక కర్తవ్యాన్ని నెరవేర్చే సంస్థలుగా మార్చేందుకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. మూడు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల సదస్సులో ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ జారీ చేసింది.స్వయం ప్రతిపత్తి పేరుతో యూనివర్శిటీలు ఇష్టారాజ్యంగా సిలబస్‌ను మార్చడం, పాఠ్యప్రణాళికల్లో మార్పు చేయడం, వార్షిక ప్రణాళికల్లో మార్పు, మూల్యాంకనంలో మార్పులు చేయడం వల్ల ఒక యూనివర్శిటీకి, మరో యూనివర్శిటీకి పొంతన లేకుండా పోయింది. పక్క పక్కనే ఉన్న రెండు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో గానీ, రెండు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో గానీ కనీస ఏకరూపత లేకపోవడం విద్యార్థులు ఒక యూనివర్శిటీ నుండి మరో యూనివర్శిటీకి తొందరగా బదిలీ కాలేకపోతున్నారు. ఒక వేళ విద్యార్థి ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి బదిలీ కాదల్చుకున్నా అదో పెద్ద ప్రహసనంగా మారింది. దీంతో అన్ని విశ్వవిద్యాలయాల్లో ఏక రూప ప్రణాళిక అమలుచేస్తే నాణ్యతా ప్రమాణాలను క్రమబద్ధీకరించవచ్చని ఎంహెచ్‌ఆర్‌డీ భావిస్తోంది. ఇందులో భాగంగా అన్ని విశ్వవిద్యాలయాల వీసీలకు నూతన సూచనలను జారీ చేసింది. యూజీసీ క్వాలిటీ నిబంధనలను ప్రతి యూనివర్శిటీ తప్పని సరి పాటించాలని, 2022 నాటికి అన్ని వర్శిటీలు నిర్బంధంగా నేక్ అక్రిడిటేషన్ పొందాల్సిందేనని సూచించింది. 2019-20 విద్యాసంవత్సరం నుండి అభ్యసన ఫలితాల ఆధారంగా పాఠ్యప్రణాళికను రూపొందించాలని, యూనివర్శిటీల్లో కొత్తగా చేరిన అధ్యాపకులకు 3స్వయం2 వేదికగా శిక్షణ ఇప్పించాలని సూచించింది. విద్యార్థులకు, అధ్యాపకులకు పోటీతత్వంతో పరిశోధన ప్రాజెక్టులను అప్పగించడం, పరిశోధనలకు, సంస్కృతి వికాసానికి వీలుకల్పించే వాతావరణాన్ని యూనివర్శిటీల్లో సృష్టించడం, స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి స్మార్టు ఇండియా హాకథాన్ వంటి కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొంది. విద్యార్థుల్లో చైతన్యం సృష్టించి, గ్రామాల్లో ఆర్ధిక, సామాజిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రతి యూనివర్శిటీ ఉన్నత భారత్ అభియాన్ పథకం కింద ఐదు గ్రామాలను దత్తత తీసుకోవడం, వృత్తి విద్యా కోర్సులను ప్రారంభించి, జాతీయ వృత్తి విద్యా వికాస పథకం కింద నిధులను పొంది, ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలను కల్పించాలని పేర్కొంది. డిజిటల్ అభ్యసనాన్ని ప్రోత్సహించడం, శోథసింథు, నేషనల్ డిజిటల్ లైబ్రరీ, స్వయం వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారంలను విరివిగా వినియోగించుకోవడం, డిగ్రీలను ప్రదానం చేసిన తర్వాత వాటిని నేషనల్ డిజిటల్ లైబ్రరీలో ఆ డాటాను అప్ డేట్ చేయాలని సూచించింది. పరిశోధన సమయంలో కాపీ జరగకుండా అందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ ఇతర ఆధునిక పరిశీలన పద్ధతులపై విద్యార్ధులకు అవగాహన కల్పించి, తప్పుడు పద్ధతులకు పాల్పడకుండా నిరోధించడం, క్యాంపస్‌లను విధిగా శుభ్రంగా ఉంచడం, చెట్లను నాటించి, పర్యావరణ అనుకూల క్యాంపస్‌లుగా మార్చడం విధిగా నిర్ణయించింది. ఈ కార్యక్రమాలను ఎప్పటికపుడు యూనివర్శిటీల వీసీలే పర్యవేక్షించి, నివేదికలను ఇవ్వాలని పేర్కొంది.