రాష్ట్రీయం

టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు టచ్‌లో ఉన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 30: టీఆర్‌ఎస్ నేతలు చాలా మంది తనతో టచ్‌లో ఉన్నారని టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌లో చాలా మంది నేతలు అభద్రతా భావంతో ఉన్నారని ఆయన సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ముందుకు వస్తున్న వారిని చేర్చుకుంటామని ఆయన తెలిపారు. పేర్లు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. టీఆర్‌ఎస్‌లో నాయకులు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. మంత్రులకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుతో మాట్లాడే ధైర్యం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. విభజన హామీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. మంత్రులు, ఇతర నాయకులు మాట్లాడితే ఏమిటీ లాభమని అన్నారు.
రాహుల్ సానుకూలం..
అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని తాను ఇటీవల సీడబ్ల్యుసీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రతిపాదన చేశానని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రతిపాదన పట్ల ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఎన్నికలకు చాలా రోజుల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌లో టిక్కెట్ల కోసం పోటీ పెరుగుతున్నదంటేనే తమ పార్టీ అధికారంలోకి రానున్నదన్న సంకేతాలు ఉన్నందుకే కదా? అని ఉత్తమ్ ఒక ప్రశ్నకు సమాధానంగా ఎదురు ప్రశ్నించారు. సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తున్నాయని ఆయన తెలిపారు.
రాహుల్ పర్యటన..
వచ్చే నెలలో రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటన ఉంటుందని ఆయన తెలిపారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాతే రాహుల్ పర్యటన ఉంటుందన్నారు.
మా పార్టీపై విమర్శలా?
తెలంగాణ బిల్లులో ఉన్న హామీలనే సాధించలేని ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ విమర్శలు చేయడమా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. రాష్టప్రతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతునిచ్చినప్పుడు, జీఎస్‌టికీ మద్దతునిచ్చినప్పుడు విభజన హామీల డిమాండ్లను కేంద్రం ముందు ఎందుకు పెట్టలేదని ఆయన కేసీఆర్‌ను ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులు, మైనారిటీలూ తమ పార్టీకి అండగా ఉన్నారని ఆయన తెలిపారు. సీమాంధ్రులకు తమ పార్టీపై కోపం తగ్గిందన్నారు. వచ్చే ఎన్నికల్లో సెటిలర్లకూ టిక్కెట్లు ఇస్తామని ఉత్తమ్‌కుమార్ చెప్పారు. పొత్తులు లేకున్నా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఆయన తెలిపారు. సామాజిక సమతుల్యత, గెలుపు సర్వేలు అభ్యర్థుల ఎంపిక సమయంలో పరిగణలోకి తీసుకుంటామని ఆయన వివరించారు.