రాష్ట్రీయం

రాజమండ్రి ఎయిర్‌పోర్టు విస్తరణ వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 30: ఇటు పారిశ్రామికంగా శరవేగంగా విస్తరిస్తున్న విశాఖ, అటు రాజధాని విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టు నడుమవున్న రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు ఆంధ్రప్రదేశ్‌కు కీలకమైన ఎయిర్‌పోర్టుగా ప్రాధాన్యత సంతరించుకుంది. శరవేగంగా ఈ ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. దీంతో అనుకున్న దానికంటే ముందుగానే డిసెంబర్ నాటికి మొత్తం పనులు పూర్తయి ఒకేసారి నాలుగు పెద్ద ఎయిర్‌బస్‌లు పార్కింగ్ చేయగల రన్‌వే, సేఫ్టీ ఏరియా సదుపాయం కలుగుతోంది. అతి పెద్ద రన్‌వేగా 316 మీటర్ల మేర విస్తరణ పూర్తయింది. పాత రన్‌వేను సాంకేతికంగా అభివృద్ధి చేసి కొత్త రన్‌వేను నిర్మించారు. రన్‌వే, సేఫ్టీ ఏరియా నిర్మాణం పూర్తయింది. 2016లో ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు రెండేళ్లలోనే పూర్తికావడం రికార్డు అంటున్నారు. వాస్తవానికి ఉదయం ఏడున్నర గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు సాగుతున్నప్పటికీ ఆ సమయం మినహాయించి మిగిలిన సమయాల్లో పనులు వేగంగాచేసి లక్ష్యం కంటే ముందుగానే పూర్తిచేయడం విశేషంగా పేర్కొంటున్నారు. ఈ ఎయిర్‌పోర్టుకు ఎయిర్ ట్రాఫిక్ కూడా అనూహ్యంగా పెరిగింది. 2104-15లో ఏడాదికి లక్షా 56 వేల మంది ప్రయాణికులుంటే, 2015-16లో రెండు లక్షల నాలుగు వేలకు పెరిగింది. 2016-17లో 2 లక్షల 61 వేల మంది, 2017-18లో 2 లక్షల 68 వేలకు పెరిగింది.
ఈ ఏడాది ఇప్పటివరకు 2018-19లో మొదటి మూడు నెలలకే 1.16 లక్షల మంది ప్రయాణికులు నమోదయ్యారంటే ఎయిర్‌ట్రాఫిక్ ఏ విధంగా పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం రోజుకు రానుపోనూ పది ట్రిప్పులుగా విమాన ట్రాఫిక్ వుంది. స్పైస్ జెట్, ట్రూజెట్ విమానాలు నడుపుతున్నారు. అక్టోబర్ నుంచి ఎయిర్ ఇండియా సంస్థ కూడా రానుంది. దీంతో రోజుకు రానుపోను 15 ట్రిప్పుల వరకు ప్రయాణాలు జరగనున్నాయి. 2018-19లో 8 లక్షల మంది ప్రయాణికులకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఈమేరకు డిసెంబర్ కల్లా బోయింగ్, ఎయిర్‌బస్‌లు రానున్నాయి. ఈ నేపథ్యంలో రాజమండ్రి ఎయిర్‌పోర్టు రానున్న కాలంలో చాలా కీలకంగా మారనుంది. విశాఖలోని తూర్పు నావికాదళం విమానాశ్రయం కావడంతో యుద్ధ సమయంలో ఆ విధంగా ఉపయోగపడినా, విపత్తుల సమయంలో రాజమండ్రి ఎయిర్‌పోర్టు ద్వారా కీలకమైన సేవలు అందించడానికి అవకాశం వుంది. బెల్లీ కార్గో కాకుండా అవసరం మేరకు సరుకు రవాణా కలిగిన ఎయిర్‌పోర్టుగా కూడా ఈ విస్తరణ పనులు జరిగాయని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజ్‌కిషోర్ చెప్పారు. ఎయిర్‌పోర్టు ట్రాఫిక్ పెరగడంతో అనుబంధ రంగాలు కూడా ఇతోధికంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఏర్పడిందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వాణిజ్యం, పర్యాటక రంగాలు విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, కొబ్బరి, ఆక్వా, కడియం నర్సరీలు, పచ్చి సరుకులు తాజాగా రవాణాచేసే అవకాశం కలిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పండ్లు, పూలు, రొయ్యలు, పీతలు, చేపలు తదితరాలను దేశంలోని పెద్ద పెద్ద మార్కెట్లకు తాజాగా తీసుకెళ్ళే అవకాశం కలిగింది. కొబ్బరి ఉప ఉత్పత్తులు, రిలయన్స్, ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థలు అప్పటికపుడు ప్రత్యేక పరికరాలను తెచ్చుకునేందుకు కూడా వీలు పడుతుందంటున్నారు. కాకినాడ సముద్ర తీరంలో దాదాపు 150 హేచరీల వరకు విస్తరించి వున్నాయి. సూరత్, కోల్‌కత్తా వంటి ప్రాంతాలకు తాజాగా ఉత్పత్తులను పంపించవచ్చు. ఇక్కడ నుంచి కేవలం 4 గంటల్లోనే దేశంలోని ప్రధాన ప్రాంతాలకు ఎగుమతి చేసే అవకాశం కలగనుంది. ఈమేరకు కోన చేపలు, మండపీతలను కూడా ఇక్కడ నిర్మించిన కోల్డ్ స్టోరేజి ఆధారంగా పూర్తయిన కార్గో టెర్మినల్ ద్వారా ఎగుమతులు చేసేందుకు సిద్ధమైంది.