రాష్ట్రీయం

కాంగ్రెస్‌కు శక్తి, యుక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా రానున్న ఎన్నికలకు బహుముఖ వ్యూహంతో ముందుకు నడిపిస్తున్నట్టు ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి చెప్పారు. పార్టీకి చెందిన వివిధ అనుబంధ సంఘాలు, సమన్వయకర్తలతో సమావేశమై విధివిధానాలు రూపొందించనున్నట్టు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పాలనకు ముగింపు పలకాలని, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని ఏపీసీసీ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీ కార్యకర్తలకు శిక్షణ తరగతులపై సీనియర్ నాయకులు, పార్టీ బీసీ విభాగం కార్యవర్గ సమావేశంలో రఘువీరారెడ్డి సమీక్షించారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఊమెన్ చాందీ నేతృత్వంలో పార్టీ అనుబంధ సంఘాలు, విభాగాలు, శాఖల చైర్మన్లతో సమావేశం నిర్వహిస్తామన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయమని, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్పించి ప్రస్తుతం ఉన్న 50 శాతం కంటే పెంచి, బీసీలకు ఇబ్బంది లేకుండా ఏబీసీడీఈలతో పాటు ఎఫ్‌ను కూడా చేర్చి వాళ్లను బీసీల్లో చేరుస్తామని వివరించారు. తొలుత అసెంబ్లీ నియోజకవర్గాలవారీ శిక్షణ తరగతులపై పీసీసీ సీనియర్ నేతలతో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 11 నుంచి 20లోపు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని కార్యకర్తలకు శిక్షణ ఇద్దామన్నారు. సెప్టెంబర్ 16 నుంచి 25వరకూ ప్రతి నియోజకవర్గంలోని బూత్ స్థాయి కమిటీ సభ్యులకు శిక్షణ, అక్టోబర్ 2 నుంచి 28 వరకు ఇంటింటికీ
కాంగ్రెస్ కార్యక్రమం విజయవంతానికి చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం చైర్మన్ నలుకుర్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా బీసీలకు 33శాతం రిజర్వేషన్‌తో పాటు బీసీ కార్పొరేషన్, హాస్టల్స్ వసతులను కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్న టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల అమలులో ఘోరంగా విఫలమైందన్నారు. బీసీలకు కేటాయిస్తామన్న 10వేల కోట్ల నిధులకు గాను ఐదారు వేల కోట్లకే సరిపుచ్చి మాటతప్పగా, బీసీ వర్గాలకు ఇచ్చిన 124 హామీలన్నీ తిరోగమనంలో ఉన్నాయని దుయ్యబట్టారు.

చిత్రం..కాంగ్రెస్ బీసీ విభాగం సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి