రాష్ట్రీయం

సింధు పోరాటం స్ఫూర్తిదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 5: ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణ్ధ్యాయం లిఖించేలా విజయాలు సాధిస్తూ తాజాగా రజత పతకం సొంతం చేసుకున్న పీవీ సింధు దేశ క్రీడాకారులకు స్ఫూర్తిప్రదాత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. చైనాలో జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో స్పెయిన్ క్రీడాకారిణి
కరోలినా మారిన్‌తో తలపడి అపజయం పాలైనా చక్కటి క్రీడాప్రతిభ కనబరిచిందని అభినందించారు. ఈ పోటీల్లో రజత పతకం సాధించిన సింధు భారత షట్లర్ల ఘనతను మరోసారి ప్రపంచానికి చాటిందన్నారు. భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఆమె ప్రపంచంలో గుర్తింపు పొందటం తెలుగుజాతికే గర్వకారణమన్నారు. వరుసగా రెండుసార్లు ఫైనల్స్‌కు చేరుకుని సింధు నూతన చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రపంచ స్థాయిలో నాలుగు పతకాలు సాధించటంతో పాటు దిగ్గజాలతో పోటీపడి అసమాన ప్రతిభ కనబర్చిందన్నారు. తమ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తెచ్చి ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చేలా వారిని తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో చక్కటి ప్రతిభ చూపిన సింధు, శ్రీకాంత్‌లకు ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్లుగా ఉద్యోగాలు కల్పించామని గుర్తుచేశారు. రాష్ట్రంలో పెద్దఎత్తున స్టేడియంల నిర్మాణం, అవసరమైన పరికరాలు, సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులు రూపుదిద్దుకుంటున్నారని, పాఠశాల స్థాయి నుంచే ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసందర్భంగా వివరించారు.