రాష్ట్రీయం

కాంగ్రెస్‌లో కొత్త జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 5: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారన్న వార్తతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తున్నది. పార్టీ కార్యకర్తల్లో కదనోత్సాహం ప్రారంభమైంది. పరిస్థితి మరింత మెరుగవుతుందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి ఊతమిచ్చే అంశాలు పెరుగుతాయని పార్టీ వర్గాలు ఆశపడుతున్నాయి. రెండు రోజుల పాటు జరిగే రాహుల్ పర్యటనను దిగ్విజయం చేసేందుకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లలో నిమగ్నమయింది. తెలంగాణలో కాంగ్రెస్ బలహీనంగా లేదని, అధికార టీఆర్‌ఎస్‌తోపాటు మిగతా పార్టీలకూ నిరూపించే రీతిలో ‘సత్తా’ చాటాలని పార్టీ రాష్ట్ర నాయకులు పట్టుదలతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సింగిల్ డిజిటేనని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, టీ. హరీశ్‌రావు, పలువురు టీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వారికి కనువిప్పు కలిగేలా రాహుల్ పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పట్టుదలతో కృషి చేస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ పునాదులు గట్టిగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమన్న సంకేతాలు అన్ని పార్టీలకు ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. అదే సమయంలో, సొంత పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తోంది. రాహుల్ పర్యటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుందన్న నమ్మకాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులన్నీ కాంగ్రెస్‌తో కలిసి వచ్చేందుకు కూడా ఈ పర్యటన దోహదపడగలని వారు ఆశిస్తున్నారు.
వర్సిటీ వీసీకి వినతి..
రాహుల్ పర్యటన సందర్భంగా మహిళా సంఘాలతో, సెటిలర్లతో, వ్యాపారులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కూడా సమావేశం నిర్వహించాలని భావించారు. ఆర్ట్ కళాశాల ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం
(మైదానం)లో విద్యార్థులతో సమావేశం కావాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. అయితే, యూనివర్సిటీ ఆవరణలో కాబట్టి దీనికి వైస్-్ఛన్సలర్ అనుమతి తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంటుంది. రాహుల్ పర్యటన నేపథ్యంలో విద్యార్థులతో ముఖా-ముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని కాబట్టి సభ నిర్వహించుకోవడానికి అనుమతినివ్వాలని ఎన్‌ఎస్‌యూఐ నేతలు వైస్-్ఛన్సలర్‌కు ఇదివరకే విజ్ఞప్తి చేశారు. కానీ వీసీ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఈ కార్యక్రమం నిర్వహణపై తర్జన-్భర్జన జరుగుతున్నది. ఉత్కంఠ కొనసాగుతున్నది. బలవంతంగా సభ నిర్వహించేందుకు యత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం, ఆ తర్వాత విద్యార్థులు రెచ్చిపోవడం జరుగుతుందని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
రాహుల్‌కు ఇష్టమైన..
రాహుల్‌కు ఇష్టమైన హైదరాబాద్ బిర్యానీ తినిపించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాట్లు చేశారు. 13న మధ్యాహ్నం ప్యారడైజ్ రెస్టారెంట్‌కే రాహుల్ చేరుకుని భోజనం చేయడానికి ఇష్టపడుతున్నట్లు సమాచారం. 14న రాహుల్ పాతనగరంలోని మదీనా హోటల్‌లో డిన్నర్ చేసి, ఇరానీ చాయ్ సేవించేలా కార్యక్రమాన్ని ఖరారు చేశారు.
అధ్యక్షుడయ్యాక తొలిసారి..
రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. అంతకు ముందు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్‌లో జరిగిన రైతు యాత్రలో పాల్గొన్నారు. హెచ్‌సీయూలో గొడవ జరిగినప్పుడూ రాహుల్ వచ్చారు.
ఖరారైన పర్యటన..
ఈ నెల 13న మధ్యాహ్నం 2 గంటలకు రాహుల్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయనకు 5 వేల మోటార్ బైక్‌ల ర్యాలీతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అక్కడికి సమీపంలోని క్లాసిక్ కనె్వన్షన్ సెంటర్‌లో మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు మహిళా స్వయం సహాయక బృందాలతో రాహుల్ సమావేశమవుతారు. ఆ తర్వాత సాయంత్రం శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు నాంపల్లిలో జరిగే సభలో, ఆ తర్వాత రాత్రి 10 నుంచి 11 గంటల వరకు హరితప్లాజాలో మైనారిటీలతో సమావేశమవుతారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
14న ఉదయం 9.30 గంటలకు రాహుల్ పెద్దమ్మ గుడికి చేరుకుని పూజలు చేస్తారు. మాజీ ఎమ్మెల్యే పీ. విష్ణువర్ధన్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమై చర్చిస్తారు. ఆ తర్వాత 11 నుంచి 12.30 గంటల వరకు వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటలకు సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్‌కు చేరుకుని బిర్యానీ తింటారు. మధ్యాహ్నం 2 గంటలకు ఉస్మానియా వర్సిటీ చేరుకుని విద్యార్థులతో సమావేశమవుతారు. ఆ తర్వాత సికింద్రాబాద్, సనత్‌నగర్‌లో జరిగే వేర్వేరు బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం గోషామహల్‌లో జరిగే సభలో పాల్గొని, రాత్రి 9 గంటలకు పాతనగరంలోని మదీనా హోటల్‌లో డిన్నర్ చేసి, చాయ్ తాగి రాత్రి 10.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతారు.