రాష్ట్రీయం

యువకులే ఆవిష్కర్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: కుటుంబ అవసరాలకన్నా సమాజానికి అవసరమైన సరికొత్త ఆవిష్కరణలు సృష్టించగల శక్తి సామర్థ్యాలు నేటి యువతలో అపారంగా ఉన్నాయని భారత రాష్ట్ర పతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. సంగారెడ్డి జిల్లా మండల కేంద్రమైన కంది గ్రామ శివారులోని ఐఐటీహెచ్‌లో ఆదివారం నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వివిధ రంగాల్లో పట్ట్భద్రులైన 566 మంది విద్యార్థినీ విద్యార్థులకు పట్టా సర్ట్ఫికెట్లను ప్రధానం చేసారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్ర పతి ప్రసంగించారు. మనం కనే కల చాలా పెద్దదని, ఆ కలను నిజయం చేయాలన్నది గొప్పదని, దానిని సమయానుకూలంగా సాధించాలని సూచించారు. దోమకాటుతో సంక్రమించే మలేరియా వ్యాధి నిర్మూలనకు అవసరమైన మందును కనుగొని నోబెల్ బహుమతిని అందుకున్న రొనాల్డ్ రాస్ స్వాతంత్య్రం లభించాక ఈ ప్రాంతంలో పనిచేసిన వ్యక్తి అని ఆయన గుర్తుచేశారు. వివిధ రంగాల్లో పట్ట భద్రత సాధించి కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్న యువతకు దేశంలో అపార అవకాశాలున్నాయని వివరించారు. సమాజం చాలా పెద్దదని, అందుకు అవసరమైన వాటిని సృష్టించే ప్రయత్నం చేయాలన్నారు. హైదరాబాద్ ఐఐటీకి పదేళ్ల వయస్సే అయినా ఇక్కడి విద్యార్థులు ఎన్నో పరిశోధనలు చేసి కొత్త పుంతలు తొక్కించారని అభినందించారు. దేశంలోని ఇతర ఐఐటీలను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. హైదరాబాద్‌కు గొప్ప చరిత్ర ఉందని, ఈ ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థలు చాలా ఉన్నాయని
అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనేక సవాళ్లను అధిగమించడంలో ఇంజనీర్లు పురోగతి చెందుతున్నారన్నారు. 5జీ సేవలను అందించడానికి హైదరాబాద్ ఐఐటీ హక్కులను దక్కించుకోవడం అభినందనీయమన్నారు. మదిని తట్టే కొత్త ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నర్సింహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఐఐటీ డైరెక్టర్ యూబీ దేశాయ్, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్టప్రతి రాక సందర్భంగా 65వ నంబరు జాతీయ రహదారితోపాటు ఐఐటీ పరిసర ప్రాంతంలో కట్టుదిట్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేసారు. ఐఐటీలోకి వెళ్లే ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేసారు.
చిత్రాలు.. ఐఐటీహెచ్‌ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తున్న రాష్ట్ర పతి రామ్‌నాథ్ కోవింద్, విద్యార్థులు