ఆంధ్రప్రదేశ్‌

కృష్ణంరాజుకు విశ్వవిఖ్యాత నటవీర ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (కల్చరల్): భక్త కన్నప్ప సినిమాలో నటించిన కృష్ణంరాజు కన్నప్ప పాత్రకు ప్రాణం పోశారని, 40 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా నేటీకీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిందని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. కృష్ణంరాజును సన్మానించాలని ఐదేళ్ల క్రితమే ఓ నిర్ణయానికి వచ్చానన్నారు. అయితే దానికి ఆయన ఒప్పుకోలేదన్నారు. చివరకు ఈరోజు నా కల ఫలించిందన్నారు. టి.సుబ్బరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో సోమవారం విశాఖ నగరంలోని బీచ్‌రోడ్డులో సినీనటుడు కృష్ణంరాజుకు విశ్వవిఖ్యాత నటవీర బిరుదు ప్రదానం జరిగింది. పలువురు సినీప్రముఖుల సమక్షంలో కృష్ణంరాజును సన్మానించి అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ కృష్ణంరాజు పలు సినిమాల్లో ఉదాత్తమైన పాత్రలు పోషించారన్నారు. నటనలో కృష్ణంరాజుకు మరెవరూ సాటిరారన్నారు. 183 చిత్రాల్లో మూడు తరాల నటులతో కలిసి పనిచేసిన కృష్ణంరాజు వివాద రహితుడిగా నిలిచారన్నారు. నటనలో తనకంటూ ప్రత్యేక ఒరవడి సృష్టించి చరిత్రలో నిలిచిపోయారన్నారు. సినీనటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ కుంభాభిషేకాలు, యాగాలు వంటివి మనిషిలో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించేందుకు దోహదపడుతాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చెడు అంటే భయపడేలా, మంచిని ప్రోత్సహించేందుకు ఉపకరిస్తాయన్నారు. శివరాత్రి రోజు తన సోదరుడు మృతి చెందాడని, అందువల్ల ఈరోజు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొననని తెలిపారు. తాను నటించిన చిత్రాలతో కూడిన ఆడియో విజువల్‌ను ప్రదర్శిస్తున్నప్పుడు అందరూ ఆనందించారని, అయితే తాను మాత్రం నాటి జ్ఞాపకాలతో బాధపడ్డానన్నారు. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానంద్రేంద్ర సరస్వతి మహాస్వామి మాట్లాడుతూ సముద్రం పక్కన శివునికి అభిషేకం చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. శివుని పూజించడం వల్ల ప్రపంచం అంతా శాంతి వెల్లివిరుస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను అలరించాయి. కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే రమేష్‌బాబు, సినీనటులు సుమన్, రాజశేఖర్ దంపతులు, రాణా, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కృష్ణానదిలో మునిగి
ఇద్దరు యువకుల మృతి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మార్చి 7: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లలంక గ్రామంలో కృష్ణానదిలో స్నానం చేయడానికి వెళ్లిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. అవనిగడ్డకు చెందిన స్నేహితులు నడకుదిటి మనోజ్ కుమార్(12), పువ్వాడ రమణ(18), సాయి నవీన్(16) శివరాత్రి సందర్భంగా కృష్ణానదిలో స్నానానికి వెళ్లారు. స్నానం చేస్తూ వారు మరింత లోతుకు వెళ్లటంతో కాళ్లు అందక నీళ్లు తాగేసి ఉక్కిరిబిక్కిరయ్యారు. అక్కడే ఉన్న అవనిగడ్డ ఎస్సీ హాస్టల్ కుక్ గరికె అంబేద్కర్ ఇది గమనించి వెంటనే నదిలోకి దూకి వారిని రక్షించే ప్రయత్నం చేశాడు. సాయి నవీన్‌ను రక్షించిన అంబేద్కర్ మిగిలిన వారి కోసం గాలిస్తూ ప్రమాదవశాత్తూ తనుకూడా నీట మునిగాడు. గల్లంతైన వారికోసం గజ ఈతగాళ్లు విస్తృతంగా గాలించి అంబేద్కర్‌ను ఒడ్డుకు చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. తర్వాత మనోజ్ కుమార్, రమణ మృతదేహాలను వెలికితీశారు.