రాష్ట్రీయం

బోనమెత్తిన పాతనగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 5: పాతనగరం బోనమెత్తింది. చారిత్రక లాల్ దర్వాజా బోనాలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి ఘర్షణలకు అవకాశం లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆషాఢ మాసం మొదటి ఆదివారం గోల్కొండలో మొదలయ్యే బోనాల ఉత్సవాలు భాగంగా రెండో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాలతో జోరందుకుంటాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లాల్ దర్వాజా బోనాలతో జంటనగరాలతోపాటు పరిసర ప్రాంతాల్లోనూ పండగ వాతావరణం స్పష్టంగా కనిపించింది. వేకువజామున నుంచే భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించుకోవడానికి రావడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. పాత బస్తీ సమస్యాత్మక ప్రాంతం కావడంతో ముందస్తుగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. బోనాల జాతర ప్రశాతంగా ముగిసిందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. బోనాల జాతర ఉత్సవాల్లో పోలీసులు సంయమనంతో పనిచేశారని అంటూ పోలీస్ సిబ్బందిని డీజీపీ ప్రశంసించారు. కాగా, ఏటా హైదరాబాద్‌లో జరిగే బోనాల జాతరకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నది. అమ్మవారికి ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈసారి పాతబస్తీ లాల్‌దర్వాజ్ మహంకాళి అమ్మవారికి సర్కారు తరఫున మంత్రులు నాయిని నరసింహా రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్షణ్, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయ, ఇటీవల తెరాసలో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్, తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు కోదండరామ్, మాజీ ఎంపీ విజయశాంతి తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శంచుకున్నారు. హైదరాబాద్ పరిధిలో ఉన్న 24 నియోజక వర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శించుకుని పూజలు నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్లు సైతం పూజలు నిర్వహించారు. మొత్తం మీద ఆదివారం బోనాల సందడితో పాతబస్తీ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

చిత్రాలు..బోనమెత్తిన విజయశాంతి
*లాల్ దర్వాజాలోని అమ్మవారి ఆలయానికి బోనాలతో వస్తున్న మహిళలు.