రాష్ట్రీయం

మోసగాడు ‘గండ్ర’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ చీఫ్‌విప్, జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర వెంకట రమణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు న్యాయంకోసం వెళ్లే మహిళలను లొంగదీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూపాలపల్లి జిల్లా ములుగు సమీపంలోని పస్రా గ్రామానికి చెందిన కొమురెళ్లి విజయలక్ష్మీరెడ్డి పదిమంది మహిళలతో కలిసి శనివారం హన్మకొండ వడ్డెపల్లిలోని గండ్ర వెంకటరమణారెడ్డికి చెందిన బృందావనం అపార్ట్‌మెంట్ వద్ద ఆందోళన చేపట్టింది. ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసుకుని ధర్నా చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ‘రమణారెడ్డి డౌన్ డౌన్’ అంటూ చేసిన నినాదాలతో దద్దరిల్లిపోయింది. మదర్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు అయిన విజయలక్ష్మీరెడ్డి ఈ సందర్భంగా పలు సంచలన ఆరోపణలు చేసింది. ఐదేళ్ల క్రితం తన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల విషయమై హన్మకొండలోని గండ్ర వెంకటరమణారెడ్డి ఇంటికి వెళ్లానని చెప్పింది. ఈ సందర్భంగా తన సెల్ నెంబర్ తీసుకుని
రెండేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతూ వేధిస్తున్నాడని తెలిపింది. అయినా తాను వినకపోవడంతో బెదిరింపులకు పాల్పడి తనను లొంగదీసుకుని నాలుగేళ్లుగా తనతో శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేసాడని సుబేదారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపింది. న్యాయంకోసం పలుమార్లు ఫోన్లో సంప్రదించానని, హన్మకొండ, హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని అతని ఇళ్ల చుట్టూ తిరిగి విసిగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. వారం రోజులుగా తాను ఫోన్‌చేస్తే స్పందించకపోవడం, ఒకవేళ ఫోన్ మాట్లాడినా రెండు నిమిషాల వ్యవధిలోనే సీరియస్‌గా బెదిరించడం వల్లే తాను ఆందోళనకు దిగాల్సి వచ్చిందని చెప్పింది. తనతో సహజీవనం చేసి మోసం చేసిన గండ్ర వెంకటరమణారెడ్డిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది. మహిళల ఆందోళన గురించి తెలుసుకున్న సుబేదారి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గండ్ర వెంకటరమణారెడ్డిపై 417, 420, 505 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సిఐ సదయ్య తెలిపారు. అదేవిధంగా నాలుగురోజుల క్రితం బృందావనం అపార్ట్‌మెంట్ వద్ద ఆమె మొదటిసారి ఆందోళన చేపట్టినప్పుడు ఆపార్ట్‌మెంట్ సూపర్‌వైజర్ కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయలక్ష్మీరెడ్డిపై కూడా 447, 290, 294బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు. కాగా, ఈ విషయమై గండ్ర స్పందిస్తూ స్వచ్ఛంద సంస్థ విషయంపై ఆమె తన వద్దకు వచ్చిన మాట వాస్తవేమనని, కానీ ఆమె తీరు నచ్చక పక్కన పెట్టానని స్పష్టం చేశారు. చీటికిమాటికి ఫోన్లు చేయడంతో గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని, తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు కుట్ర పన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సంఘటనపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసానని ఆయన తెలిపారు. తాను మచ్చలేని నాయకుడినని, తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న విజయలక్ష్మీరెడ్డి చరిత్ర గురించి పోలీసులు లోతుగా విచారిస్తే వాస్తవాలేమిటో వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.

చిత్రం..గండ్రకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న బాధితురాలు